అప్ఘన్ సంక్షోభం: ఓవైసీపై విజయశాంతి సెటైర్లు

Update: 2021-08-19 07:33 GMT
అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు చేజిక్కించుకోవడంతో ఇప్పుడు అక్కడ అరాచక పాలన రాజ్యమేలుతోంది. అప్ఘన్ల దుస్థితి చూసి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదొక ప్రపంచ సమస్యగా మారింది. అనేక దేశాల మాదిరిగానే భారతదేశం కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. కానీ అప్ఘనిస్తాన్ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.అదే సమయంలో అప్ఘన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులను ఖాళీ చేయించడంలో బిజీగా ఉంది. తక్షణ చర్యలు చేపట్టింది.

తాజాగా ఏఐఎంఐఎం పార్టీ అప్ఘన్ సంక్షోభంపై స్పందించింది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ఒక వీడియోలో హాట్ కామెంట్స్ చేశారు. 2013లో తాలిబన్లు తిరిగి అప్ఘనిస్తాన్ చేజిక్కించుకుంటారని అంచనావేశారు. 2013,2015,2019లోనే ఈ సమస్యను ఓవైసీపీ లోక్ సభలో లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాలిబన్లతో చర్చలు జరిపి స్నేహపూర్వక పరిష్కారానికి భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఓవైసీ సూచనలను పట్టించుకోలేదు.

ఓవైసీ సూచనలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యంగ్యంగా స్పందించారు. కౌంటర్ ఇచ్చారు. భారత ప్రభుత్వానికి బదులుగా.. ఓవైసీ కాబూల్ కు వెళ్లి తాలిబన్ లతో మాట్లాడాలని విజయశాంతి కోరారు. ‘భారతదేశానికి అప్ఘన్ ప్రతినిధి తాలిబాన్ పాలనను వ్యతిరేకిస్తున్నప్పుడు మరియు.. ఆ దేశ ఉపాధ్యక్షుడు ఇంకా తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు.. తాలిబన్లతో చర్చలు జరుపాలని ఓవైసీ సూచించిన అసలు ఉద్దేశం ఏమిటీ అని విజయశాంతి ట్వీట్ చేశారు.

భారత ప్రభుత్వానికి బదులుగా, ఒవైసీ కాబూల్‌కు వెళ్లి తాలిబన్‌లతో చర్చలు జరపాలని విజయశాంతి అన్నారు. "ఒవైసీ చొరవ తీసుకోగలిగితే, అప్పుడు ఆఫ్ఘన్ సంక్షోభంలో స్వల్ప పురోగతి ఉండవచ్చన్నారు. ఓవైసీ ఖచ్చితంగా ప్రయత్నించాలి ” అని విజయశాంతి ట్వీట్ చేసి గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఏదేమైనా ఈ వ్యాఖ్యలు ఓవైసీకి గట్టి కౌంటర్ ఇచ్చేలా పూర్తి వ్యంగ్యంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒవైసీని ఎగతాళి చేసే బదులు విజయశాంతి అతని ప్రకటనలు.. వ్యాఖ్యల సందర్భాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలుకుతున్నారు..




Tags:    

Similar News