గ్రౌండ్ రిపోర్ట్: విజయవాడ తూర్పులో గెలుపెవరిది?

Update: 2019-04-04 09:30 GMT
అసెంబ్లీ నియోజకవర్గం : విజయవాడ తూర్పు

టీడీపీ: గద్దె రామ్మోహన్‌
వైసీపీ: బొప్పన భవకుమార్‌
జనసేన: బత్తిన రాము

ఉత్కంఠ రాజకీయాలకు వేదికగా ఉన్న విజయవాడలో అసెంబ్లీ పోరు రసవ్తరంగా సాగుతోంది. కృష్ణా జిల్లాలో ప్రముఖమైన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ కాపు నేతగా ఉన్న వంగవీటి రాధా వైసీపీ నుంచి టీడీపీలోకి మారడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన గద్దె రామ్మోహన్‌ మరోసారి అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి బొప్పన భవకుమార్‌ బరిలో ఉన్నారు. జనసేన నుంచి బత్తిన రాము తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కమ్మ - కాపు ఓట్లే అధికారంగా ఉన్నాయి. టీడీపీ - వైసీపీ అభ్యర్థులు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కాగా..జనసేన అభ్యర్థి కాపు సామాజిక వర్గ నేత

* విజయవాడ తూర్పు చరిత్ర

ఓటర్లు: 2 లక్షల 37 వేలు

1955లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు 11 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 10 సార్లు కాంగ్రెస్‌ - 2 సార్లు టీడీపీ - బీజేపీ - పీఆర్పీ ఒక్కోసారి విజయం సాధించాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన గద్దె రామ్మోహన్‌ వైసీపీ అభ్యర్థి రాధాకృష్ణపై విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ తరుపున మళ్లీ గద్దె రామ్మోహనే బరిలో ఉన్నారు.

* రెండోసారి గద్దె రామ్మోహన్‌:

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంగవీటి రాధాపై 15 వేల ఓట్లతో గద్దె రామ్మోహన్‌ విజయం సాధించారు. ఐదేళ్లలో ఆయన కులమతాలకతీతంగా అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయడం వంటి పనులు చేశారు. అవినీతి అక్రమాల వైపు చూడకుండా నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రత్యర్థిగా ఉన్న వంగవీటి రాధా టీడీపీలో చేరడంతో గద్దె రామ్మోహన్ కు కలిసొచ్చింది. దీంతో కాపు ఓటు బ్యాంకు పడే అవకాశం ఉంది.

*అనుకూలతలు:

-సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడం
-వంగవీటి రాధా చేరికతో పార్టీలో బలం
-అభివృద్ధి పనులు

*ప్రతికూలతలు:

-ప్రత్యర్థి కూడా కమ్మసామాజిక వర్గానికే చెందినవారు కావడం
-గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన జనసేన ఇప్పుడు బరిలో ఉండడం

* బొప్పాన భవకుమార్‌ కు నియోజకవర్గంపై పట్టు..

వైసీపీ తరుపున పోటీ చేస్తున్న బొప్పాన భవకుమార్‌ కార్పొరేటర్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేంత స్థాయికి ఎదిగారు. కిందిస్థాయి నుంచి రావడంతో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయాల్లో ఆరితేరారు. ఆయనకు నియోజకవర్గం మీద మంచి పట్టు ఉందని చెప్పుకుంటారు. టీడీపీపై వస్తున్న వ్యతిరేకతతో భవకుమార్‌ కు ఓట్లు పడే అవకాశం ఉంది. అయితే ఎప్పటి నుంచి పార్టీలో ఉంటూ టికెట్‌ ఆశించి భంగపడ్డ యలమంచి రవి అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన భవకుమార్‌ కు సహకరిస్తారా..? లేదా అనే అనుమానాలున్నాయి. అయిత వైసీపీ గాలి - జగన్ పాదయాత్రతో వచ్చిన మైలేజ్ తో గెలుస్తానని ధీమాగా చెబుతున్నాడు.

*అనుకూలతలు:

-నియోజకవర్గంపై పట్టు
-కమ్మ ఓటు బ్యాంక్‌
-వైసీపీ బలపడడం

* ప్రతికూలతలు:

-యలమంచిలి నుంచి సహకారం లేకపోవడం
-సన్నిహితుడు బత్తిన రాము జనసేన నుంచి పోటీ చేయడం

*జనసేన అభ్యర్థి రాము ఓట్ల చీలికే కీలకం..

ఇక ఆటలో అరటిపండులో విజయవాడ తూర్పులో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న  కాపుల మద్దతు జనసేనకు ఉంది. ఆ పార్టీ తరుఫున నిలబడ్డ రాము కాపు ఓట్లను చీల్చితే టీడీపీ - వైసీపీ లకు నష్టం జరుగుతుంది. అందుకే ప్రస్తుతానికి ప్రధాన పార్టీల గెలుపు ఓటములను జనసేన డిసైడ్ చేసే అవకాశాలున్నాయంటున్నారు.

* టఫ్ ఫైట్ లో గెలుపు ఎవరిది?

ప్రతి ఎన్నికల్లో కమ్మ, కాపు ఓట్లు కీలకంగా మారే ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందినవారే బరిలో ఉన్నారు. అయితే వంగవీటి రాధా టీడీపీలో చేరడంతో కాపు ఓట్ల బలం టీడీపీకి షిఫ్ట్ అవుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.  కానీ జనసేన నుంచి బత్తిన రాము పోటీ చేయడంతో ఆ ఓట్లు ఎటు చీలుతాయో అన్నది తేలాల్సి ఉంది.ఇదే జరిగితే వైసీపీ అభ్యర్థిరికి రెండు విధాలా నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్నికల సమయానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Tags:    

Similar News