విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. వన్ టౌన్ లోని మేకావారి వీధి నుంచి సుమారు 3 కిలోమీటర్ల పరిధిలో 30 కార్పొరేషన్ డివిజన్లలో మనుషులు - వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈనెల 31 వరకు నిర్బంధం ఉంటుందని అధికారులు తెలిపారు. వన్ టౌన్ కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులను - అతడు కలిసిన స్నేహితులను కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
ఇక లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసరాలు - కూరగాయల విక్రయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. అత్యవసర సేవలకు ఇబ్బంది ఉండదని తెలిపారు.
ఇక కోరనా రోగుల సంఖ్య పెరుగుతుండడంతో విజయవాడలో 200 పడకలు - సిద్ధార్థ మెడికల్ కాలేజీని కరోనా ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చారు.
ఓ వైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుంటే.. జిల్లాకు విదేశాల నుంచి ఏకంగా 1044 మంది వచ్చినట్టు అధికారులు గుర్తించారు. వీరందరినీ క్వారంటైన్ లోనే ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వివరాలను ఇవ్వాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.