దాదాపు పదిహేను నెలల క్రితం విజయవాడలో షాకింగ్ సూసైడ్ చోటు చేసుకోవటం గుర్తుండే ఉంటుంది. పదమూడేళ్ల బాలిక తనపై తరచూ జరుగుతున్న లైంగిక వేధింపులకు తాళలేక.. భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వైనం అప్పట్లో పెను సంచలనంగా మారింది. తాము నివసించే అపార్టు మెంట్ లో ఉండే చెడ్డ అంకుల్ కారణంగా తనకు చావు తప్పించి మరో మార్గం లేదన్న విషయాన్ని సూసైడ్ లెటర్ లో స్పష్టంగా పేర్కొన్న ఉదంతం గుర్తుకు వచ్చే ఉంటుంది.
ఆ కామాంధుడైన అంకుల్ కు తాజాగా కోర్టు కఠిన శిక్షను విధించింది. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తాజాగా తీర్పును ఇచ్చింది. అంతేకాదు.. వివిధ సెక్షన్ల కింద వేర్వేరు శిక్షల్ని విధించటమే కాదు.. అవన్నీ కూడా అమలు అవుతాయని స్పష్టం చేయటం గమనార్హం.
విజయవాడలోని విద్యాధర పురం కుమ్మరిపాలెం సెంటర్లో లోటస్ అపార్ట్ మెంట్ ఉంది. అందులో ప్లాట్ నెంబరు 43 లో వినోద్ జైన్ అనే వ్యక్తి నివసించేవాడు. అదే అపార్టుమెంట్ కు చెందిన 13 ఏళ్ల బాలికపట్ల అతను తరచూ అసభ్యంగా ప్రవర్తించేవాడు.
రెండు నెలల పాటు అతడి లైంగిక వేధింపులతో తీవ్ర అవస్థలకు గురైన ఆ బాలిక.. తట్టుకోలేక ప్రాణాల్ని తీసుకుంది. వెకిలిగా మాట్లాడటం.. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయటం.. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించేవాడు. దీంతో ఆమె ఆ వేధింపులకు తట్టుకోలేక..2022 జనవరి 29న అపార్ట్ మెంట్ టెర్రస్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
తాను ఆత్మహత్య చేసుకోవటానికి ముందు తన మరణానికి కారణం వినోద్ జైన్ అన్నవిషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. అతడు తన పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడో పేర్కొంటూ మూడుపేజీల లేఖను రాసింది. ఫోన్లో నూ.. ట్యాబ్ లోనూ తన వేదనను పేర్కొంది. ఈ ఉదంతం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్యకు సంబంధించి బాధిత బాలిక రాసిన లేఖ.. ఇతర ఆధారాలతో పోలీసులు అతడి పైన కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను పూర్తి చేసిన విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి రజని తన తీర్పును వెల్లడించారు.
ఆత్మహత్య కారణంగా మరణించిన బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు వినోద్ జైన్ దోషిగా కోర్టు తేల్చింది. అతన్నిఫిబ్రవరి 2022న పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పటివరకు రిమాండ్ లోనే ఉన్నాడు. అతనికి ఐపీసీ సెక్షన్ 305 కింద జీవిత ఖైదు.. రూ.లక్ష జరిమానాతో పాటు పోక్సో సెక్షన్ 9(ఎల్), సెక్షన్ 10 కింద ఏడేళ్లు కారాగార శిక్ష, రూ.50వేలు ఫైన్.. పోక్సో చట్టంసెక్షన్ 12 కింద మూడేళ్లు జైలు.. రూ.50వేలు జరిమానా.. సెక్షన్ 354 కింద ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.50వేలు జరిమానా, ఐపీసీ సెక్షన్ 509 కింద మరో మూడేళ్లు జైలు, రూ.50వేలు జరిమానా విధించారు.
కోర్టు విధించిన అన్ని శిక్షలు అమలవుతాయని.. రూ.3 లక్షల జరిమానాలో బాలిక తల్లికి రూ.2.4 లక్షల మొత్తాన్ని ఇవ్వాలని తీర్పు వెల్లడించారు.బాలికను లైంగికంగా వేధించటం.. ఆమె మరణానికి కారణం కావటం.. ఆమె తల్లిదండ్రుల మానసిక క్షోభకు కారణమైన ఈ కేసును అత్యంత క్రూరమైన నేరంగా పరిగణించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి ఈ మాత్రం శిక్షల్ని విధించాల్సిందే.