ప్రస్తుతం అంతా కంప్యూటర్ యుగం. కానీ , ప్రపంచం ఆధునిక వైపు పరుగురులు పెడుతుంది అని ఆనందించాలో లేక కంప్యూటర్ యుగం అంటూ ..ఉన్న పరిఙానాన్ని కూడా మర్చిపోతుంది అని బాధపడాలో తెలియని స్థితిలో మనం ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు విజయవాడలో ఉన్న అబ్బాయిలకి ఒక కొత్త సమస్య వచ్చిపడింది. బెజవాడ యువకుల్లో చాలామంది జ్ఞాపకశక్తి రోజురోజుకి సన్నగిల్లుతోంది అని తెలుస్తుంది. ఓ పట్టాన ఏదీ గుర్తుండటం లేదు.. గజనీ సినిమాలో అమీర్ ఖాన్ లా అందరూ షార్ట్ మైండ్ తో కొన్ని విషయాలని మర్చిపోతున్నారు. వృద్ధాప్యంలోనే మతిమరుపు వస్తుందని అనుకుంటాం కానీ - నిజానికి మతిమరుపు సమస్య టీనేజ్ లోనే మొదలవుతుంది అని చెప్పాలి.
25 ఏళ్ల నుండి 35 ఏళ్ల వయసువారిలో అది తీవ్రస్థాయికి చేరుతుంది. అసలు తమకు మతిమరుపు అనే జబ్బు ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. పని ఒత్తిళ్లు - మరికొన్ని సమస్యలు వారి జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సమస్యని బెజవాడ అబ్బాయిలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టు బయటపడింది. ఈ జనరేషన్ ఎదుట బోలెడంత టెక్నాలజీ - అరచేతిలో ఉన్న మొబైల్ ఫోన్ సగం అనారోగ్యానికి కారణమవుతోంది.అలాగే సోషల్ మీడియాలోనో, వీడియో గేమ్స్ మోజులోనో పడి నిద్రకు దూరం కావడంతో - సరిపడినంత నిద్ర లేకపోవడం వల్ల మెదడు మందగించి ఈ సమస్య మొదలౌతుంది. దీన్ని బట్టే చూస్తే దీనిపై పేరంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటికొక గజనీ తయారు కావడం ఖాయం.
ఫుడ్ హాబిట్స్ కూడా మెదడుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. విటమిన్-బి 12 లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.. రెడీమేడ్ ఫుడ్ కు.. జంక్ ఫుడ్ కు అలవాటు పడిన యువతకు సమస్య తీవ్రత అర్థం కావడం లేదు. అయితే , ఇప్పటికైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.. చిన్నచిన్న లెక్కలకు కూడా క్యాలిక్యులేటర్ ను వాడటం మానేయాలి. ఫోన్ నంబర్లను సెల్ లో ఫీడ్ చేసుకోవడం మానేసి, - బంధువులు మిత్రుల నంబర్లనైనా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి - మరీ ముఖ్యంగా టైమ్ కు నిద్రపోవాలి - ఒత్తిడిని జయించాలి - ముఖ్యంగా పిల్లలపై ర్యాంకుల విషయంలో అట్టిది చేయడం మానేయాలి.