దీపిక ఎక్కడ.. రెండు రోజులైంది - ఆందోళనలో తల్లిదండ్రులు!

Update: 2020-09-29 11:51 GMT
వికారాబాద్‌ యువతి కిడ్నాప్ కేస్‌ సస్పెన్స్‌గా మారింది. గంటలు రోజులుగా మారుతున్నా కూడా ఇంకా ఆ యువతి ఆచూకీ మాత్రం లభ్యం కావడంలేదు. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా లాక్కెళ్లిన ఘటన.. వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యువతి కుటుంబసభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలింపును ముమ్మరం చేశారు.

వికారాబాద్ పట్టణానికి చెందిన దీపిక ఆదివారం సాయంత్రం తన అక్కతో కలిసి ఆలంపల్లి రోడ్డులో షాపింగ్‌ చేసి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఓ వాహనంలో వచ్చి సినిమా తరహాలో కిడ్నాప్ చేసి , ఆ వాహనం లో ఎక్కించుకోని క్షణాల్లో పరారైయ్యారు.  ప్రేమ వివాహం ఇష్టం లేని అమ్మాయి తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం దీపికను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో దీపిక, అఖిల్ కుటుంబసభ్యుల మధ్య పెద్ద గొడవే జరిగింది. అయితే విడాకుల కోసం ఇద్దరి మధ్య.. వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు కుటుంబసభ్యుల మధ్య కేసు కూడా నడుస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 26,2020 న రెండు కుటుంబాలు కోర్టుకు హాజరయ్యారు. అయితే 27వ తేదీ సాయంత్రం దీపిక తన అక్కతో కలిసి బయటికి రావడంతో.. ఆమె భర్త కారులోనే వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్లు దీపికా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీపిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ, ఫోన్ ‌కాల్‌ డేటా ఆధారంగా గాలిస్తున్నారు.

ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్న దీపిక ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీపికను ఆమె భర్త అఖిలే కిడ్నాప్‌ చేశాడని పోలుసులునిర్ధారించారు. అఖిల్‌ స్నేహితుల ద్వారా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఉన్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దీపిక కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సవాలుగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యితే వికారాబాద్‌లో పలుచోట్లు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వారు ప్రయణించిన కారు ఎటువైపు వెళ్లిందో కనిపెట్టడం పోలీసులకు కొంచెం కష్టంగా మారింది. అయితే , పోలీసులు మాత్రం భర్త వద్దే దీపికా ఉందని అనుమానం వ్యక్తం చేస్తు న్నామని త్వరలో కేసు ఛేదిస్తాం అని చెప్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు దీపికా కి ఏమౌతుందో , ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.  చివరికి  ఈ కిడ్నాప్‌ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News