ఉగ్రవాది వికారుద్దీన్ ఎంత క్రూరుడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతగాడికి పోలీస్ అంటే చాలా కోపం. అంతకు మించి చులకన భావం కూడా ఎక్కువే. పోలీసుల్ని అతగాడు తిట్టినన్ని తిట్లు మరెవరో తిట్టి ఉండరేమో. అయినప్పటికీ విధి నిర్వహణలో వీటిని భరిస్తూ.. అతగాడికి సంబంధించిన డ్యూటీని అతి కష్టమ్మీద పూర్తి చేయటం పోలీసులకు అలవాటే.
కొందరు పోలీసులు అయితే ఈ టార్చర్ తట్టుకోలేక.. వికారుద్దీన్‌కు సంబంధించిన డ్యూటీ అంటే హడలిపోయే పరిస్థితి. వికారుద్దీన్‌కి ఏమైనా జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసిన నేపథ్యంలో.. పోలీసులు అతడు ఏమన్నా రెస్పాండ్ కాకుండా యంత్రాల మాదిరిగా పని చేస్తుంటారు. వరంగల్ జైల్లో అతగాడికి.. అతని తోటి వారిని వేర్వేరు గదుల్లో ఉంచుతారు.
వీరికి ఇంగ్లిషు దినపత్రికల్ని అందిస్తుంటారు. దీంతో.. ప్రపంచంలో ఏం జరుగుతుందన్న విషయాలపై వీరికి అవగాహన ఉంటుంది. వీరికి కాపలాగా ఉండే పోలీసులకు అధికారులు నిత్యం క్లాసులు పీకుతూనే ఉంటారు. ఇక.. వీరికి ఎస్కార్ట్‌గా వెళ్లాల్సిన వారి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత ప్రమాదకరమైన వీరి విషయంలో చాలా జాగ్రత్తలతో ఉండాలని.. ఏ మాత్రం అవకాశం ఉన్నా తప్పించుకుంటారంటూ వార్నింగ్ ఇస్తుంటారు.
ఇలాంటి వికారుద్దీన్.. మొన్న ఎన్‌కౌంటర్‌కు ముందు జైలు నుంచి బయలుదేరిన సమయంలో వాహనంలో కూర్చున్న తర్వాత.. నల్గండ జిల్లా జానకీపురం వద్ద సిమి ఉగ్రవాదులు ఇద్దరిని కాల్చి చంపిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఇద్దర్ని చంపగానే హీరోలయ్యారా? అంటూ వ్యాఖ్యానించటమే కాదు.. ఈ సందర్భంగా పోలీసుల్ని బండబూతులు తిట్టినట్లు చెబుతున్నారు. అనంతరం.. పారిపోయేందుకు ప్రయత్నించటం.. ఆ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోవటం తెలిసిందే.