అనుచరుల్ని వరుస పెట్టి ఏసేస్తున్నారు.. అసలోడు ఎక్కడ?

Update: 2020-07-09 01:53 GMT
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎపిసోడ్ తెలిసిందే. తనను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పుల్ని జరిగిన ఇతగాడి దుశ్చర్య కారణంగా డీఎస్పీ స్థాయి అధికారి మొదలుకొని పోలీస్ కానిస్టేబుల్ స్థాయి వరకు మొత్తం ఎనిమిది మంది మరణించటం తెలిసిందే. ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపటంతో పాటు.. యూపీ ప్రభుత్వం తల కొట్టేసినంత పనైంది. దీంతో.. ఎంతకూ లొంగక చెలరేగిపోయే వికాస్ దూబేను అదుపులోకి తీసుకునేందుకు యూపీ సర్కారు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.

ఈ క్రమంలో అతడ్ని పట్టుకునే ప్రయత్నాలు చేయటం.. ఆఖరి నిమిషాల్లో మిస్ కావటం అలవాటుగా మారింది. నేతలతోనూ.. పోలీసులతోనూ అతనికున్న సానిహిత్యంతో దొరక్కుండా తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడికి తొత్తులుగా ఉండే అధికారులపై తాజాగా చర్యల కొరడా విదులుస్తున్నారు. మరోవైపు వికాస్ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పక్కా వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం నాటికి ఒక ప్రధాన అనుచరుడ్ని లేపేస్తే.. తాజాగా మరో ఇద్దరు ముఖ్య అనుచరుల్ని ఎన్ కౌంటర్ లో పోలీసులు హతమార్చారు. దీంతో.. వికాస్ కు అత్యంత సన్నిహితుంగా ఉండే వారిని ఒక్కొక్కరిగా లేపేస్తున్నారు. బుధవారం జరిపిన ఎన్ కౌంటర్ లో వికాస్ అనుచరుల వద్ద నుంచి డబుల్ బ్యారెల్ గన్ తో పాటు.. క్యాట్రిడ్జ్ ను స్వాధీనం చేసుకున్నారు. తనను అదుపులోకి తీసుకునేందుకు యూపీసర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ.. దేశం విడిచి పారిపోయేందుకు వీలుగా వికాస్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

భారత్ లో ఉంటే తనకు ముప్పేనన్న విషయాన్నిఅర్థం చసుకున్న వికాస్.. నేపాల్ వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో.. అలెర్టు అయినా అధికారులు ఎయిర్ పోర్టుతో పాటు.. నిఘా వర్గాలకు ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వికాస్ దేశం దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న పట్టుదలతో యూపీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News