ఇండియన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘమైన క్రీడాజీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించాడు. సచిన్ సృష్టించిన రికార్డులు గురించి చెప్పుకోవాలంటే కొన్ని రోజులే పడతాయి. సచిన్ రికార్డుల చరిత్రను రాయాలంటే వందల పుస్తకాలు కూడా సరిపోవు. ఈ క్రమంలోనే సచిన్ 27 సంవత్సరాల క్రితం ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో అత్యంత చిన్న వయసులో నెలకొల్పిన ఓ రికార్డు ఎట్టకేలకు తాజా ప్రపంచకప్ లో బద్దలైంది. ఈ రికార్డును బద్దలు కొట్టింది పసికూన దేశమైన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ కావడం మరో విశేషం.
27 ఏళ్ల క్రితం తన తొలి ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్(1992) లో సచిన్ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో కేవలం 18 ఏళ్ల 332 రోజుల వయసులో 87 పరుగుల స్కోర్ సాధించాడు. అత్యంత చిన్న వయసులో ప్రపంచకప్ లో ఈ స్కోరు కొట్టిన తొలి క్రికెటర్ గా సచిన్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఏళ్లు గడుస్తున్నా అప్పటి నుంచి ఆ రికార్డు పదిలంగానే ఉంది.
తాజా ప్రపంచకప్ లో గురువారం వెస్టిండీస్ - అప్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అఫ్ఘనిస్తాన్ ఓపెనర్ విక్రమ్ ఆలీ సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. 18 ఏళ్ల 278 రోజుల వయసులో ఆలీ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తం 93 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లతో 86 పరుగులు చేయడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఓపెనర్ వచ్చిన విక్రంను గేల్ ఎట్టకేలకు ఎల్బీగా అవుట్ చేశాడు.
విక్రం అద్భుత బ్యాటింగ్ తో ఒకానొక దశలో అప్ఘాన్ విజయం దిశగా దూసుకెళుతున్నట్టు అనిపించినా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో విండీస్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ వరల్డ్ కప్ లో అప్ఘన్ తాను ఆడిన 9 మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది.