స‌ర్పంచుల ఇష్టారాజ్యం

Update: 2022-02-13 13:30 GMT
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ స‌ర్పంచ్‌లు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొత్త పంచాయ‌తీ రాజ్ చ‌ట్టాన్ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. రూ.కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేయ‌డంలో ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌డం లేదు. ఈ విష‌యాల‌న్నింటినీ రాష్ట్ర ఆడిట్ శాఖ బ‌య‌ట‌పెటింది. ప్ర‌జాధ‌నం అంటే ఎలాంటి బాధ్య‌త లేకుండా గ్రామ పంచాయ‌తీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని తెలిసింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా టీఆర్ఎస్ స‌ర్పంచ్‌లే ఉన్నారు. అధికారాన్ని అడ్డుపెడ్డుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేస్తున్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా గ‌త ఆర్ధిక సంవ‌త్స‌రానికి సంబంధించి 2.12 ల‌క్ష‌ల ఆడిట్ అభ్యంత‌రాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో వేలాడి ఆడిట్ అభ్యంత‌రాల్లో బ‌డ్జెట్ ఆమోదం లేకుండానే ఖ‌ర్చు చేస్తున్న వ్య‌వ‌హారాలు వెలుగు చూశాయి.

అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో ఆడిట్ అభ్యంత‌రాలున్నాయ‌ని తెలిసింది. ఆ త‌ర‌వ్ఆత మ‌హ‌బూబాబాద్‌, న‌ల్గొండ‌, సంగారెడ్డి జిల్లాలున్నాయ‌ని ఆడిట్ శాఖ వెల్ల‌డించింది.

గ్రామాల్లో స‌ర్పంచ్‌లు నిర్వాకం వ‌ల్ల నిధుల దుర్వినియోగం, ప‌నుల్లో నాణ్యత లోపం ప‌రిపాటిగా మారాయ‌ని అధికారులు అంటున్నారు. బ‌డ్డెట్ ఆమోదం లేకుండా స‌ర్పంచ్‌లు నిధులు ఖ‌ర్చు చేయ‌కుండా చూడాల్సిన బాధ్య‌త పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌దే. కానీ వాళ్లు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ్రామ స‌చివాల‌యాల్లో ఉద్యోగుల జీత భ‌త్యాల కోసం 30 శాతం, పారిశుద్ధ్యం కోసం, వీధి దీపాలకు, మంచినీరుకు 15 శాతం చొప్పున‌, రోడ్లు, కాలువ‌ల‌కు 20, ఇత‌ర అవ‌స‌రాల కోసం 5 శాతం వ్య‌యం చేయాల్సి ఉంది. కానీ కొత్త పంచాయ‌తీ రాజ్ చ‌ట్టాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

బ‌డ్జెట్లో ఆమోదించిన వాటిని అదే ఆర్థిక సంవ‌త్సరం లోపు ఖ‌ర్చు చేయాలి. అద‌న‌పు కేటాయింపుల‌కు పంచాయ‌తీ విస్త‌రణాధికారి అనుమ‌తి తీసుకోవాలి. బ‌డ్జెట్‌లో చేర్చ‌ని ప‌ద్దుపై ఖ‌ర్చు చేయ‌కూడ‌దు. కేటాయింపుల కంటే ఎక్కువ వ్యయం చేయ‌కూడ‌దు. ఈ నేప‌థ్యంలో ఆడిట్ అభ్యంత‌రాల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని జిల్లా అధికారుల‌ను పంచాయ‌తీరాజ్‌శాఖ క‌మిష‌న‌ర్ ఆదేశించారు. మ‌రి ఇప్ప‌టికైనా ప‌రిస్థితుల్లో మార్పు వ‌స్తుందేమో చూడాలి.
Tags:    

Similar News