హైద‌రాబాద్‌లో ఉగ్ర క‌ల‌క‌లం.. 16 మంది అరెస్టు.. ఏం జ‌రిగింది?

Update: 2023-05-09 15:27 GMT
తెలంగాణ రాజ‌ధాని.. హైద‌రాబాద్ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఉగ్ర‌మూక‌లు రాజ‌ధానిలోకి చొర‌బ‌డ్డాయ న్న వార్త‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. అంతేకాదు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చిన పోలీసులు.. ఇక్కడ త‌నిఖీలు చేయ‌డం..మ‌రింతగా న‌గ‌ర వాసుల‌ను వ‌ణికించింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో  హైదరాబాద్‌లో తలదాచు కున్న రాడికల్‌ ఇస్లామిక్‌ కార్యకర్తలను భోపాల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఓ కేసులో భాగంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులతో కలిసి హైదరాబాద్‌లో నిఘా పెట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఇవాళ 16 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 11 మంది భోపాల్‌, ఐదుగురు హైదరాబాద్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కత్తులు, డాగర్లు, ఇస్లామిక్ జిహాద్ సాహిత్యం, సెల్‌ఫో న్లు, లాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు.

కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. నగరంలో 18 నెలలుగా రాడికల్‌ ఇస్లామిక్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ ఇంటిలిజెన్స్ పోలీసులతో పాటు.. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. నింది తులు ఉంటున్న ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

భోపాల్కు చెందిన నిందితులపై అక్కడి పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. 16మంది నిందితులను భోపాల్కు తరలించారు. యువతను సైతం ఇస్లామిక్ రాడికల్స్గా మార్చేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్లను ప్రశ్నించడం ద్వారా ఏదైనా కుట్ర పన్నారా అనే వివరాలు బయటపడతాయని ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌పై విమ‌ర్శ‌లు తాజాగా హైద‌రాబాద్‌లో ఏకంగా 16 మందిని అరెస్టు చేయ‌డం.. క‌ల‌క‌లం సృష్టిస్తే.. మ‌రో వైపు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌పైనా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏడాన్న‌ర‌గా.. భోపాల్ నుంచి వ‌చ్చి.. ఇక్క‌డ ఉంటున్న డ‌జ‌ను మందిని ఎందుకు గుర్తించ‌లేక‌పోయార‌నేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌.

అంతేకాదు.. ఏదైనా జ‌రిగితే.. ఏం చేస్తార‌ని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ గుర్తించ‌క‌పోతే.. స‌గ‌టు హైద‌రాబాదీ  ప్రాణం ప‌రిస్థితి ఏంట‌ని కొంద‌రు అడుగుతున్నారు. కేసీఆర్ స‌ర్కారు హ‌యాంలో రాజ‌కీయాల‌పైఉన్న దృష్టి ప్ర‌జా భ‌ద్ర‌త‌పై లేదా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

Similar News