మొన్నీ మధ్య లేటు వయసులో ఘాటుగా భర్త కావాలంటూ ఓ బామ్మ పేపర్లో ఇచ్చిన ప్రకటన వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన 73 ఏళ్ల బామ్మ ఈ వయసులో తనకు తోడు వెతుక్కోవడం.. అది బహిరంగంగా పేపర్లో ప్రకటన ఇవ్వడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.
వృద్ధాప్యం దరిచేరాక.. భవ బంధాలన్నీ దూరమై.. నా అనే వాళ్ల లేక చాలా మంది కృష్ణ రామా అంటూ కాలం గడుపుతుంటారు. అయితే ఈ 73 ఏళ్ల బామ్మ మాత్రం తను ఈ వయసులో ఒంటరిగా ఉండలేకపోతున్నానని.. తనకు తోడు కావాలని అంటోంది. ఈ వయసులో ఆ తోడు కోరిన బామ్మ ప్రకటన ఇప్పుడు వైరల్ అయ్యింది.
కర్ణాటకలోని మైసూరుకు చెందిన వృద్ధురాలు భర్తతో విడాకులు తీసుకుంది. ఒంటరిగా ఉండలేకపోతున్నానని.. శేష జీవితం అంతా కలిసి ఉండే ఓ తోడు కావాలని చెప్పింది. తన కన్నా పెద్ద వయసు, ఆరోగ్యవంతుడైన వ్యక్తి భర్తగా కావాలని పేపర్ ప్రకటన ఇచ్చింది. తనది బ్రాహ్మణ కులం కాబట్టి కాబోయే భర్త తప్పనిసరిగా బ్రాహ్మణుడే అయ్యి ఉండాలని షరతు పెట్టింది ఈ బామ్మ.
ఈ వయసులో తోడు దొరకడమే కష్టం అనుకుంటే ఈ బామ్మ పెట్టిన కండీషన్లు చూస్తే అస్సలే దొరకని పరిస్థితి. ఈ టైంలో కృష్ణ రామా అనుకుంటూ ఉండక ఏంటీ తోడు కోరికలు అని అందరూ సెటైర్లు వేస్తున్నారు... బామ్మ చేసిన ప్రకటన సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ఈ ప్రకటన చూసి ఆ బామ్మను ఓ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. 69 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ఆమెను చేసుకుంటా అని ముందుకొచ్చాడు. ఆయన భార్య కూడా గతంలో మరణించిందట.. మరి బామ్మ ఆ తాతను ఓకే చేస్తుందో లేదో చూడాలి.