ఆ దేశంలో మహిళల శవాలతో శృంగారం నిజం కాదా?

Update: 2023-05-01 13:44 GMT
పాకిస్తాన్‌ లో సమాధులు తవ్వి మహిళల శవాలపై అత్యాచారాలు చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మరణించిన మహిళల కుటుంబీకులు ఆ సమాధులకు గ్రిల్స్‌ ఏర్పాటు చేసి తాళాలు బిగుస్తున్నారని కథనాలు వచ్చాయి. శవాలతో సంభోగం పాకిస్థాన్‌ లో ట్రెండ్‌ గా మారిందని.. పాకిస్తాన్‌ లో పలు ప్రాంతాల్లో ఇలా విచ్చలవిడిగా మహిళల సమాధులు తవ్వేసి శవాలతో సంభోగిస్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.

కాగా ఇలా శవాలతో శృంగారం చేయడాన్ని నెక్రోఫీలియా అంటారు. గతంలో పలు దేశాల్లోనూ ఇలా శవాలతో సంభోగించారనే సంఘటనలు వెలుగుచూశాయి. ఇది మనిషిలో ఉండే ప్రకృతి విరుద్ధక బుద్ది అని చెబుతున్నారు.

అయితే మీడియాలో వచ్చిన కథనాలు నిజం కావని అంటున్నారు. జర్నలిజం ముసుగులో కొందరు తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడుతున్నారు. పత్రికల్లో ప్రచురితమైన కథనం, ఫొటోల్లో నిజం లేదని అంటున్నారు. పాకిస్థాన్‌ లో సమాధికి గ్రిల్స్‌ ఏర్పాటు చేసి తాళం వేసి ఉన్న ఫొటోను ఒకదాన్ని పత్రికలు ప్రచురించాయి. అయితే ఆ ఫొటో పాకిస్థాన్‌ లోది కాదని.. మన హైదరాబాద్‌ నగరంలోదని చెబుతున్నారు.

ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో కొందరు జర్నలిస్టులే దీన్ని వెలుగులోకి తెచ్చారు. శత్రు దేశం పాకిస్తాన్‌ పై కావాలనే కొందరు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఆ మాటకొస్తే గతంలో మనదేశంలోనూ శవాలపై అత్యాచారాలు జరిగాయని గుర్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌ లోని ఖబ్రస్తాన్ లో స్థలాలు లేవు..అన్ని నిండిపోయాయని అంటున్నారు. దీంతో చాలా మంది ముందే రిజర్వ్‌ చేసుకుని పెట్టుకుంటారని చెబుతున్నారు. కొన్ని సార్లు స్థలం లేక వేరే సమాధులు తవ్వి ఖననం చేయడం కూడా జరుగుతుందని పేర్కొంటున్నారు.

అలా జరగకుండా కొందరు తమ కుటుంబ సభ్యుల సమాధులకు గ్రిల్స్‌ ఏర్పాటు చేసుకుంటున్నారని వివరిస్తున్నారు. పాకిస్థాన్‌ లో అంటూ మీడియాలో వచ్చిన సమాధి ఫొటో హైదరాబాద్‌ లోని మాదన్నపేట రెయిన్‌ బజార్‌ లోనిదని చెబుతున్నారు.

Similar News