పైకి కనిపించేదొకటి. అసలు విషయం మరొకటి అన్నట్లుగా ఉంటాయి కొన్ని వ్యవహారాలు. తాజాగా కోహ్లీపై జరుగుతున్న ప్రచారాన్ని చూస్తుంటే. టీమిండియా క్రికెటర్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీది ఆగ్రస్థానం అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. కోహ్లీ నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం ఒకటి షురూ అయ్యింది. యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న కోహ్లీ ప్రముఖ శీతల పానీయమైన పెప్సీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. కోట్లాది రూపాయిల కాసులు కురిపించే ఈ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న కోహ్లీని తప్పు పడుతూ కొంగొత్త ప్రచారం ఊపందుకుంది.
కోహ్లీ చేసేదొకటైతే.. చెబుతున్నది మరొకటిగా మారిందని.. తన వ్యక్తిగత ఫిట్ నెస్ కోసం ఒకలా.. ప్రచారం విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారన్న విమర్శల జోరు మరింత ఊపందుకుంది. కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే 15 బ్రాండ్లలో పెప్సీ ఒకటి. మిగిలిన బ్రాండ్లను పక్కన పెడితే.. పెప్సీకి కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటాన్ని పలువురు వేలెత్తి చూపిస్తున్నారు. పురుగుమందుల అవశేషాల ఆరోపణలు ఉంటూ.. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పెప్సీ లాంటి శీతల పానీయానికి కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా ఉంటారు? అంటూ సూటి ప్రశ్న వేస్తున్నారు. తాను తీసుకునే ఆహారం విషయంలో నిక్కచ్చిగా ఉండే కోహ్లీ.. అందుకు భిన్నంగా ప్రచారం చేయటం ఏమిటంటూ పలువురు నిలదీస్తున్నారు.
వ్యక్తిగతంగా కోహ్లీ భారత్ లో లభించే ఏ మినరల్ వాటర్ నూ వినియోగించడని చెబుతుంటారు. రోజువారీగా తాగే నీళ్లను ఆయన విదేశాల నుంచి తెప్పించుకుంటారని.. ఆయన తాగే వాటర్ లీటరు రూ.500 పైనే ఉంటాయని చెబుతారు. స్వచ్ఛమైన మినరల్స్ తో కూడిన ఒక ప్రముఖ బ్రాండ్ వాటర్ ను రోజువారీగా తాగుతారని చెబుతారు. తీసుకునే ఆహారంలోనూ కోహ్లీ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొవ్వు తక్కువగా ఉండే మాంసాహారం.. సాల్మన్ ఫిష్.. ఉడకబెట్టిన శాకాహారం.. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఫుడ్ ను మాత్రమే తీసుకుంటారు. అంతదాకాఎందుకు.. ప్యాకేజ్డ్ డ్రింక్స్ ను కూడా కోహ్లీ తీసుకోరని ప్రతీతి. ఇలా తన వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకునే కోహ్లీ.. పెప్సీకి ఎలా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు? అని పలువురు నిలదీస్తున్నారు.
ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే శీతలపానీయాల ప్రచారాన్ని వదులుకోవాలన్న సూచనలు చేస్తున్నారు. చూసేందుకు ప్రజలకు ప్రయోజనం కలిగించేలా ఉండాలన్న హితోక్తులు పైకి చెబుతున్నట్లు కనిపించినా.. అసలు కారణం మరేదైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ ప్రపంచంలో పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తమ ప్రత్యర్థి బ్రాండ్లను దెబ్బ తీసేందుకు ప్రముఖ బ్రాండ్లు స్వచ్ఛంద సంస్థల్ని వినియోగించటం ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉండే విధానమే. అలాంటి వ్యూహామే కోహ్లీ విషయంలో తాజాగా జరుగుతున్న ప్రచారం వెనుకుందన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
కోహ్లీని పెప్సీ ప్రచారకర్తగా చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలగాలని కోరుతున్న వారు.. దేశంలో చాలామంది స్టార్ సెలబ్రిటీలు చేసే బ్రాండింగ్ మీద ఫోకస్ చేయకుండా.. కోహ్లీ బ్రాండ్ల లో ఒకటైన పెప్సీ మీద మాత్రమే ప్రచారాన్ని మొదలెట్టటం ఏమిటన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదంతా కార్పొరేట్ వార్ తో సాగుతున్న ప్రచార మాయాజాలమని.. కోహ్లీ మీద ఒత్తిడి తెచ్చేందుకే ఈ తరహా ప్రచారం మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. పెప్సీని కోహ్లీని వదులుకోవటం అంటే ఆయనో బ్రాండ్ ను వదిలేయటమే కాదు.. కోట్లాది రూపాయిల ఆదాయాన్ని చేజార్చుకోవటమే. ప్రజల శ్రేయస్సు పేరుతో కోహ్లీ ఇమేజ్ మీద సోషల్ మీడియాలో స్టార్ట్ అయిన చర్చపై కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.