వారిద్ద‌రిని చూస్తే హిస్ట‌రీ రిపీట్ అవుతుంద‌నిపిస్తుంది!

Update: 2019-07-07 10:15 GMT
కొన్ని ఉదంతాలు భ‌లే ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. ఇంగ్లండ్ తాజాగా జ‌రుగుతున్న వ‌రల్డ్ క‌ప్ క్రికెట్ టోర్నీలో టీమిండియా.. న్యూజిలాండ్ జ‌ట్లు తొలి సెమీస్ లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ఒక విచిత్ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌రిగ్గా ప‌ద‌కొండేళ్ల క్రితం 2008 అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ సంద‌ర్భంగా సెమీస్ లో భార‌త్.. న్యూజిలాండ్ జ‌ట్లు పోటీ ప‌డ్డాయి. ఇదేకాదు.. అప్ప‌ట్లో టీమిండియా జ‌ట్టు కెప్టెన్ గా కోహ్లీ ఉంటే.. న్యూజిలాండ్ జ‌ట్టు కెప్టెన్ గా విలియ‌మ్స్ వ్య‌వ‌హ‌రించారు.

ద‌శాబ్దానికి పైనే మ‌ళ్లీ వీరిద్ద‌రి నేతృత్వంలోని జ‌ట్లు తాజాగా మ‌రోసారి సెమీస్ లో త‌ల‌ప‌డ‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి. అప్ప‌ట్లో మ‌లేషియా వేదిక‌గా మ్యాచ్ జ‌రిగితే.. తాజాగా మాత్రం ఇంగ్లండ్ వేదిక‌గా మ్యాచ్ జ‌రుగుతోంది. రెండు జ‌ట్ల మ‌ధ్య ఒకేలాంటి పోరు జ‌ర‌గ‌టం చాలా అరుదైన విష‌యంగా చెప్పాలి. అన్నింటికి మించి జ‌ట్ల కెప్టెన్లు ఇరువురు త‌ల‌ప‌డ‌టం కూడా విశేషంగా చెప్పాలి.

ఇక‌.. అప్ప‌ట్లో జ‌రిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 205 పేరుగులు చేసింది. అనంత‌రం భార‌త జ‌ట్టు బ్యాటింగ్ చేస్తుండ‌గా.. వ‌ర్షం కురిసింది. దీంతో మ్యాచ్ స‌మ‌యాన్ని కుదించి.. డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 43 ఓవ‌ర్ల‌కు 191 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించారు. అయితే.. నాటి మ్యాచ్ లో కోహ్లీ 53 బంతుల్లో 43 ప‌రుగులు చేయ‌టం.. ఎస్ పీ గోస్వామి 76 బంతుల్లో 51 ప‌రుగులు చేయ‌టంతో టీమిండియా 41.3 ఓవ‌ర్ల వ్య‌వ‌ధిలోనే ఏడు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అధిగ‌మించింది. హిస్ట‌రీ రిపీట్స్ అన్న‌ట్లుగా జ‌ట్లు.. జ‌ట్ల కెప్టెన్లు ఒక‌రే అయి త‌ల‌ప‌డుతున్న వేళ‌.. తుది ఫ‌లితం నాటి మాదిరే నేడు కూడా ఉంటుందా? అన్న‌ది తేలాలంటే మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కూ వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News