భార్యతో కలిసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న విరాట్ .. ఎక్కడ ?

Update: 2019-11-05 09:14 GMT
అతను భారత క్రికెట్‌ చరిత్రలో ఒక సంచలనం. వి అంటే వికర్టీ, ఐ అంటే ఇంటెలిజెంట్‌, ఆర్‌ అంటే రెస్పానిబుల్‌, ఏ అంటే ఆల్‌రౌండర్‌, టీ అంటే టైమింగ్‌. వీటన్నింటిని కలిపితే అతనే టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ . కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే ఎటువంటి బౌలర్ అయినా కూడా వణికిపోవాల్సిందే. విరాట్ రికార్డ్స్ ఆలా ఉన్నాయి మరి. ఒక్కసారి కోహ్లీ బ్యాటింగ్ లో  కుదురుకుంటే ..కోహ్లీ ని అవుట్ చేయడం ఆ దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. విజయమే తన శ్వాసగా  ఆటలో దూకుడైన స్వభావం తో తనతోటి ఆటగాళ్లకు స్పూర్తినిస్తూ ..ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తూ క్రికెట్ ప్రపంచానికి రారాజుగా వెలుగొందుతున్నాడు విరాట్.

ఇకపోతే నేడు టీమిండియా కెప్టెన్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ 31వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ రోజు ముఖ్యంగా విరాట్ అభిమానులకి పండుగరోజు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ t20 సిరీస్ నుండి విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ , తన భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్ కి విహారయాత్రకు వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ తీరిక లేకుండా వరుస సిరీస్ లలో పాల్గొంటున్నాడు. అలాగే హీరోయిన్ అనుష్క శర్మ కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. దీనితో ఈ  జంట ప్రస్తుతం ఆట నుంచి, సినిమాల నుంచి విరామం తీసుకుని భూటాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడే తన భార్య తో కలిసి కోహ్లీ తన పుట్టిన రోజు వేడుకలని జరుపుకుంటున్నాడు.

ఈ సందర్భంగా తన ప్రయాణం, గమ్యంపై తనకుతానే భావోద్వేగపూరిత లేఖ రాసుకున్నాడు. హాయ్‌ చీకూ, మొదటగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీ భవిష్యత్‌ గురించి అనేక ప్రశ్నలున్నాయని నాకు తెలుసు. నన్ను క్షమించు, నేను వాటికి సమాధానం చెప్పలేను. ఎందుకంటే భవిష్యత్‌లో ఏం జరగనుందో తెలియదు. ప్రతి సర్‌ప్రైజ్‌ తీయగా, ప్రతి సవాలు అద్భుతంగా, ప్రతి నిరాశ ఏదో ఒకటి నేర్చుకోవాలనే పట్టుదలను తీసుకొస్తాయి. ఈరోజు నువ్వు వీటిని నమ్మలేకపోవచ్చు. కానీ.. గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యం. ప్రయాణం మాత్రం సూపర్‌ అంటూ తన మనసులోని మాటలని ఒక లెటర్ రూపంలో తెలియజేసాడు. 
Tags:    

Similar News