అయ్యయ్యో.. కష్టాలన్నీ కోహ్లీకే..ఇప్పుడేమో రూ.12 లక్షల జరిమానా!

Update: 2020-09-25 12:10 GMT
కోహ్లీకి కొన్నేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కథ ఏమీ బాగాలేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది ఆ జట్టు వ్యవహారం. ప్రపంచంలోనే టాప్ బ్యాట్స్మెన్, టాప్ బౌలర్లు బెంగళూరు సొంతం. కానీ ఇంతవరకు ఆ జట్టు ఒక్క సారి కూడా ట్రోఫీని ముద్దాడ లేదు. ఏ  ఏడాదికి ఆ ఏడాది ఈసారి కప్పు బెంగళూరు దే అని చెప్పుకోవడం తప్ప చేసేది ఏమీ లేకుండా పోతోంది. ఈ ఐపీఎల్ టోర్నీలో అయినా బెంగళూరు పుంజుకుంటుంది అనుకుంటే షరా  మామూలుగానే వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ ఓటమి చెందింది. ఇదిలా ఉంటే  కోహ్లీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ సీజన్   వరుసగా రెండు మ్యాచుల్లోనూ  ఘోరంగా విఫలం చెందాడు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న కోహ్లీకి మరో దెబ్బ పడింది.

పంజాబ్తో జరిగిన మ్యాచ్ లో  స్లో ఓవర్ రేట్ కారణంగా విరాట్ కోహ్లీ కి రూ. 12 లక్షల జరిమానా విధించారు. గురువారం బెంగళూరు, పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగగా  పంజాబ్ 97 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.    కేఎల్ రాహుల్ భారీ సెంచరీ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచులో  స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేసినందుకు కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించారు.  బెంగళూరు బౌలర్లు నిర్ణీత సమయం కల్లా మ్యాచ్ ని ఫినిష్ చేయక పోవడంతో  ఈ ఫైన్ వేశారు. ఈ సీజన్ లో వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మ్యాచులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం విరాట్ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఫామ్ లో లేకపోవడం, వరుసగా రెండు మ్యాచ్ల్ లో ఓటమి, ఎప్పుడూ చురుగ్గా ఉండే కోహ్లీ ఫీల్డింగ్ లో కూడా తప్పిదాలు చేయడంతో విమర్శలు వస్తున్నాయి.
Tags:    

Similar News