కోహ్లీ.. నీ బెదిరింపులకు ఎవ్వరూ భయపడరు.. ఆట మీద దృష్టి పెట్టు! సెహ్వాగ్ సెటైర్లు
టీం ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. విరాట్ కోహ్లీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. కోహ్లీ బెదిరింపులు, కవ్వింపు చర్యలు పక్కనపెట్టి ఆటమీద దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్య అద్భుతంగా ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్‌కోహ్లి... సూర్యకుమార్‌ను కవ్వించాడు. 13వ ఓవర్‌లో సూర్య ఓ బంతిని కోహ్లి వైపు కొట్టాడు. బంతిని పట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ వద్దకు వచ్చి కవ్వింపు చర్యలకు దిగాడు. అవేమీ పట్టించుకోని సూర్య కుమార్ యాదవ్ తన ఆటతోనే బదులిచ్చాడు.
ఈ విషయాన్నే వీరు ప్రస్తావించాడు. ‘సూర్యకుమార్ ఎవరి బెదిరింపులకు భయపడడు.. అతడు తన ఆటతోనే అందరికీ సమాధానం ఇస్తాడు. ఈ విషయం ఇప్పటికే కోహ్లికి అర్థమై ఉంటుంది.’ అంటూ పంచ్‌లు వేశాడు సెహ్వాగ్. సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టులో చోటు దక్కడం గురించి మాట్లాడుతూ.. ‘అతడికి భవిష్యత్తులో కచ్చితంగా అవకాశం వస్తుంది. ఐపీఎల్లో రాణించిన ఎందరో క్రికెటర్లు భారతజట్టులో అవకాశం దక్కించుకున్నారు. అందుకు వరుణ్ చక్రవర్తే ఉదాహరణ’ అంటూ వీరు తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఏది ఏమైనా ఐపీఎల్ 2020 మాత్రం చాలా హాట్‌హాట్‌గా సాగుతున్నది. రోజుకు మలుపు తిరుగుతూ ఉత్కంఠగా సాగుతున్నది.