డిప్రెషన్,యాంగ్జైటీ కి లోనవుతున్న అమెరికన్లు ..కారణం ఇదే !

Update: 2020-05-28 01:30 GMT
అమెరికాలో మహమ్మారి విలయతాండవం చేస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఆ తర్వాత అన్ని దేశాలకి వ్యాప్తి చెందింది. అయితే , అమెరికాలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా కొనసాగుతుంది. ఇప్పటికే 17 లక్షల మందికి పైగా ఈ వైరస్ భారిన పడ్డారు. అయితే , ఇదే సమయంలో అమెరికన్ల మానసిక ఆరోగ్యంలో పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయని ఓ సర్వేలో తెలింది. ఈ వైరస్ అమెరికన్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించినట్లు ఆ సర్వే చెబుతుంది.

ఎంప్లాయిమెంట్, హౌసింగ్, ఫైనాన్సెస్, ఎడ్యుకేషన్, హెల్త్ పై కరోనా మహమ్మారి ప్రభావం ఎలా పడిందో తెలుసుకునేందుకు న్యూ ఎమర్జెన్సీ వీక్లీ సర్వేలో భాగంగా ఏప్రిల్ చివర్లో యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ఇటీవల నిర్వహించిన సర్వేలో కొన్ని ఆశక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1/3వ వంతు అమెరికన్లలో anxiety (ఆందోళన), డిప్రెషన్ (మానసిక కృంగుబాటు) ను గుర్తించినట్లు ఈ సర్వే తెలిపింది. కొందరిలో ఈ రెండు లక్షణాలను గుర్తించినట్లు సర్వే తెలిపింది. వరుస షట్ డౌన్ లు, మరణాల సంఖ్య పెరగిపోవడం,నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోవడం,ఆర్థిక అనిశ్చితి వంటి పరిణామాలన్నీ అమెరికన్ల మెంటల్ హెల్త్ పై ప్రభావం చూపుతున్నాయన్న ఆ సర్వే లో తేలింది.

పెద్దలలో ప్రతి 100మందిలో 10మందికి డిప్రెషన్ లక్షణాలు, ప్రతి 100మందిలో నలుగురిలో anxiety లక్షణాలు, ప్రతి 100మందిలో 20మంది అమెరికన్లకు ఈ రెండు లక్షణాలు ఉన్నట్లు సర్వే తెలిపింది. ముఖ్యంగా ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్న వారిలో పేదలు, యువత,మహిళలు ఉన్నారని...మిస్సిసిప్పి రాష్ట్రంలో అయితే ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. మొత్తంగా, సర్వేలో పాల్గొన్న వారిలో 24 శాతం మంది పెద్ద డిప్రెసివ్ డిసార్డర్ యొక్క వైద్యపరమైన ముఖ్యమైన లక్షణాలను చూపించగా, 30శాతం మంది సాధారణమైన ఆందోళన రుగ్మత లక్షణాలను కనబర్చినట్లు తెలిపింది.
Tags:    

Similar News