దేశంలో మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యులు , విఐపిలు అన్న తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతూపోతోంది. తాజాగా ఢిల్లీలోని రాజ్యసభ సెక్రటేరియెట్ లో డైరెక్టర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పార్లమెంట్ బిల్డింగ్ లోని రెండు అంతస్తులను మూసేసారు. దీనితో ఆ అధికారితోపాటు ఆయన భార్య, పిల్లలకు కూడా వైరస్ సోకినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ హౌజ్ లోని మొదటి అంతస్తును శానిటైజ్ చేసి సీల్ చేశారు.
అయితే ఆ అధికారితో టచ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క అధికారి, వ్యక్తిగత సిబ్బంది కూడా తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అధికారులు ఆదేశించారు. పార్లమెంట్ భవనంలో విధులు నిర్వర్తించే ఉన్నతాధికారికి కరోనా వైరస్ సోకడం ఇది రెండో కేసు.శానిటైజ్ చేయించాక పార్లమెంటు భవనం తెరుస్తామని అధికారులు చెప్పారు. గత 24 గంటల్లో భారత్ లో 7 వేల 466 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తొలిసారి దేశంలో ఒకేరోజు ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. భారత్ లోని వైరస్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 1.65 లక్షలకు చేరుకుంది.
ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 2,190కేసులు నమోదయ్యాయి. వైరస్ కు సంబంధించిన మృతుల సంఖ్య 4 వేల 706 చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో ఈ వైరస్ భారీ నుంచి 71,105 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 175 మృతి చెందగా దేశంలో చికిత్స పొందుతున్న వైరస్ పాజిటివ్ రోగుల సంఖ్య 89,987గా ఉంది.