తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు ఒడిషా సినీ నటిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బు, నగలు తీసుకొని మోసం చేసిందంటూ విశాఖపట్నానికి చెందిన యువకుడు పద్మరాజు రవికుమార్ కటక్-భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనర్ ను కలిసి విన్నవించాడు.
ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన సదురు ఒడిషా నటి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన నుంచి ల్యాప్ ట్యాప్, రూ.2లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకుందని రవికుమార్ పోలీసులకు వివరించాడు. తన నుంచి భారీగా దోచుకున్న తర్వాత చిన్మయ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై భువనేవ్వర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తాజాగా విశాఖ యువకుడి ఆరోపణలపై సదురు హీరోయిన్ స్పందించింది. భువనేశ్వర్ లో మీడియాతో మాట్లాడింది. తాను ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేసింది. రవికుమారే తనతో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకొని అభిమానిని అంటూ తనను కలిసి డబ్బులు ఇబ్బంది ఉందని లక్షన్నర తీసుకున్నాడని తెలిపింది. 50వేలు మాత్రమే తిరిగి ఇచ్చాడని.. పెళ్లి చేసుకుంటానని ప్రస్తావన తెస్తే నో చెప్పినందుకే ఇలా కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆమె పేర్కొంది.