విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది చనిపోయారు. 200 మంది వరకు చికిత్స పొందుతున్నారు. రోడ్ల పై సృహ తప్పి పడిపోయిన వీరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే కోలుకుంటున్న బాధితుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దీంతో తమకు ఏం జరుగుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. విషవాయువు స్టైరిన్ ప్రభావానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కొత్త సమస్యలు బాధితులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
విషవాయువు స్టైరిన్ దుష్పరిణమాలు మొదలయ్యాయి. బాధితుల చర్మం పై బొబ్బలు, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత చర్మంపై కమిలిపోయి బొబ్బలువస్తున్నాయి. కొందరికీ ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారు. కిడ్నీ, కాలేయ పనితీరులో తేడా కొడుతున్నట్టు సమాచారం.
ఇక స్టైరిన్ గ్యాస్ ప్రభావానికి లోనైనా ఓ చిన్నా పిల్లాడు కనీసం కళ్లు కూడా తెరవేకపోతున్నాడు. ఆ గ్యాస్ ప్రభావానికి కళ్లు మంట పుట్టి సృహ కోల్పోయిన బాధిత బాలుడు ఇప్పుడు చూడలేకపోతున్నాడు.
విశాఖలో మొత్తం 12 మంది ఈ గ్యాస్ కారణంగా మరణించారు. 554మంది బాధితులుగా మిగిలిపోయారు. ఇందులో 52 మంది చిన్నారులు ఉన్నారు. మృతులు కుటుంబాలకు సీఎం జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. బాధితుల వైద్య ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. వారికి కూడా పరిహారం ప్రకటించారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది.