మిత్రుడి లేఖ చిత్తుకాగితంతో స‌మాన‌మా బాబు?

Update: 2017-09-19 10:20 GMT
అధికార‌ప‌క్షంపై విప‌క్షాలు విరుచుకుప‌డ‌టం మామూలే. కానీ.. మిత్ర‌ప‌క్షం అధికార‌ప‌క్షంపై మండిప‌డ‌టం చాలా అరుదుగా జ‌రుగుతుంటుంది. మిత్ర‌ధ‌ర్మాన్ని ప‌క్క‌న ప‌డేసి.. తమ విన‌తుల్ని సైతం ప‌ట్టించుకోని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌ద్యం దుకాణాల‌కు అనుమ‌తుల్ని విచ్చ‌ల‌విడిగా ఇస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే మూట‌గ‌ట్టుకున్న ఏపీ స‌ర్కారు తీరును విష్ణు మండిప‌డ్డారు. మ‌ద్యం దుకాణాల అనుమ‌తుల్ని ఇష్టారాజ్యంగా ఇచ్చేరంటూ ఆగ్ర‌హం వ్య్తం చేసిన ఆయ‌న స్కూళ్ల‌కు 100మీట‌ర్ల ప‌రిధిలో మ‌ద్యం దుకాణాల‌కు అనుమ‌తులు ఇవ్వ‌కూడ‌ద‌ని చెప్పినా లైసెన్స్ జారీ చేశార‌న్నారు.

తానుప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో 8 మ‌ద్యం దుకాణాల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశాన‌ని.. అనుమ‌తులు ఇవ్వొద్ద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేసినా లైసెన్స్ జారీ చేసిన‌ట్లుగా విష్ణుకుమార్ రాజు మండిప‌డ్డారు. రూల్స్ కు వ్య‌తిరేకంగా లైసెన్స్ లు ఇవ్వ‌టంపై తాను విసిగిపోయిన‌ట్లుగా చెప్పారు.

త‌మ విన‌తుల్ని సీఎం కూడా ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విష్ణు.. సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర ఆరోప‌ణ చేశారు. తాను ఈ నెల 17న విమానాశ్ర‌యంలో విన‌తిప‌త్రం ఇచ్చాన‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 13 బార్లు.. 14 వైన్ సాపులు ఉన్నాయ‌ని అందులో 8 మ‌ద్యం దుకాణాలు వ‌ద్ద‌ని చెప్పాన‌న్నారు. అయితే.. అధికారులు త‌మ లేఖ‌ల్ని చిత్తుకాగితాల మాదిరి ప‌డేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

తాము విన‌తిప‌త్రం ఇస్తే బుట్ట‌దాఖ‌లు చేయ‌టం అధికారుల‌కు అల‌వాటుగా మారింద‌న్నారు. విశాఖ‌ప‌ట్నంలో లిక్క‌ర్ మాఫియాను ఎక్సైజ్ సూప‌రిండెంట్ అడ్డుకుంటున్నా.. అమ‌రావ‌తి నుంచే నేరుగా ఆర్డ‌ర్లు పొంది లైసెన్స్ లు తెప్పించుకుంటున్నార‌న్నారు. త‌మ విన‌తుల‌పై బాబు స‌ర్కారు స్పందించ‌కుంటే నిర‌స‌న‌ను మ‌రింత ఉధృతం చేయ‌నున్న‌ట్లుగా చెప్పారు.
Tags:    

Similar News