పెను సంచలనంగా..అంతకుమించి షాకింగ్ గా ఉంది వైఎస్ వివేకా హత్య.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన విచారణను సీబీఐ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీత కోరుకకుంటున్నారు. తాజాగా జిల్లా ఎస్పీకి ఆమె లేఖ ఇవ్వటం కొత్త చర్చకు తెర తీసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కూడా తమ ఇంటి పరిసరాల్లో అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నారని ఆమె చెప్పిన మాట సంచలనంగా మారింది.
పులివెందులలో తమ ఇంటి చుట్టూ కొందరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ నెల పదిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. వారి ఉద్దేశం ఏమిటో మాకు తెలియదు. మా కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఈ నెల పదిన సాయంత్రం 5.20 గంటల సమయంలో పులివెందులలో మా ఇంటి చుట్టూ అనుమానం కలిగేలా తిరుగుతూ కనిపించాడు. సదరు వ్యక్తి వివేకా హత్య కేసులో అనుమానితుడిగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరు. ఆ వ్యక్తి డి.శివశంకర్ రెడ్డి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉన్న ఫోటోలోని వ్యక్తే మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరిగారు. ఇదే విషయాన్ని 12న స్థానిక సీఐ భాస్కర్ రెడ్డికి తెలిపాను’’ అని సునీత పేర్కొన్నారు.
ఇప్పుడీ ఉదంతం సంచలనంగా మారింది. ఇదే విషయం గురించి సునీత మరికొన్ని అంశాల్ని చెప్పుకొచ్చారు. ‘‘మా ఇంటి పరిసరాల్లోని సీసీ కెమేరాల్ని పరిశీలించాం. కేటరింగ్ వ్యాపారం చేసుకునే మణికంఠ రెడ్డి అనే వ్యక్తి తన వ్యాపారం కోసం అద్దె స్థలం కోసం వెతుకుతున్నట్లు చెబుతున్నారు. మణికంఠ రెడ్డి.. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శివ శంకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అతడి అనుచరులు మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరగటం మాకు ఆందోళన కలిగిస్తోంది. తక్షణమే ఇంటి వద్ద శాశ్వత ప్రాతిపదికన పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలి’ అని ఆమె కోరుతున్నారు.ఇదిలా ఉంటే.. ఎస్పీ ఆదేశాల మేరకు సునీత ఇంటి వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేయటం గమనార్హం.
తమ కుటుంబంలో మొత్తం700 మంది వరకు ఉంటామని.. అందరిని కలిపితే తమదే ఒక చిన్న ఊరు అవుతుందని సునీత పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి చేస్తున్న న్యాయపోరాటంతో తమ కుటుంబ సభ్యుల సహకారం ఉందన్నారు. పోలీసు.. సీబీఐ లాంటి వ్యవస్థలపై తనకు నమ్మకం ఉందని.. ఇప్పుడిప్పుడే సీబీఐ ఆ దిశగా విచారణ చేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భయం కలుగుతుందన్నారు. ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని తన సోదరుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనన్న డాక్టర్ సునీత.. ఈ కేసు విచారణలో షర్మిల మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరి మద్దతు కూడా ఉందన్నారు.