ముంబై ని మించుతున్న వైజాగ్!

Update: 2020-01-13 09:09 GMT
దేశంలో అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల్లో ముంబై ఒక‌టి. దేశ ఆర్థిక రాజ‌ధానిగా ముంబై నిలుస్తూ ఉంటుంది. దాంతో పాటు బాలీవుడ్ కు కేంద్రంగా, అనేక వ్యాపార లావాదేవీల‌కు కేంద్రంగా నిలుస్తుంది ముంబై. ఆ తీర ప్రాంత న‌గ‌రం భార‌త దేశానికే ఆయువుప‌ట్టు లాంటిది.

తీర ప్రాంత న‌గ‌రాల‌కు అలా ఎదిగే అవ‌కాశాలు ఎప్పుడూ ఉంటాయంటారు. ఇప్పుడు విశాఖ‌ప‌ట్ట‌ణానికి అలాంటి అవ‌కాశ‌మే వ‌చ్చిన‌ట్టుగా ఉంది. ముందు నుంచినే వైజాగ్ స్థ‌లాల రేట్ల విష‌యంలో అయితేనేం.. డిమాండ్ విష‌యంలో అయితేనేం.. ముందున్న న‌గ‌రం. తుఫాన్లు వైజాగ్ స్థాయిని త‌గ్గించ‌లేక‌పోయాయి.

ఇలాంటి క్ర‌మంలో ఏపీకి మూడు రాజ‌ధానుల్లో ఒక‌టిగా వైజాగ్ ను ప్ర‌క‌టించాల‌న్న సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిపాద‌న వ‌చ్చాకా అక్క‌డ రియ‌లెస్టేట్ బూమ్ ఊపందుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌త్యేకించి సినిమా, రాజ‌కీయ‌, వ్యాపార వ‌ర్గాల చూపులు ఇప్పుడు వైజాగ్ మీద ప‌డింద‌ట‌. ఇక రియ‌లెస్టేట్ బ్రోక‌ర్ల హ‌డావుడి ఎలాగూ ఉండ‌నే ఉంటుంది. ఇలాంటి నేప‌థ్యంలో వైజాగ్ లో ఖాళీ స్థ‌లాల‌కు ఎన‌లేని డిమాండ్ ఏర్ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది.

ఎక్క‌డ ఖాళీ స్థ‌ల‌ముందా.. వ్యాపారం చేద్దామా.. అన్న‌ట్టుగా చాలా మంది చూపు విశాఖ మీద ప‌డిన‌ట్టుగా స‌మాచారం. దీంతో అక్క‌డ ధ‌ర‌లు అప్పుడు చుక్క‌ల‌కు అంటుతున్నాయ‌ని స‌మాచారం. మూడు రాజ‌ధానుల్లో ఒక‌టి..అయిన‌ప్ప‌టికీ వైజాగ్ కు ఆల్రెడీ ఉన్న డిమాండ్ తో ప్ర‌స్తుత బూమ్ మ‌రింతగా ధ‌ర‌ల‌ను పెంచేస్తోంద‌ని స‌మాచారం. అప్పుడే వైజాగ్ లో భూముల ధ‌ర‌లు, అపార్ట్ మెంట్ల ధ‌ర‌లు ముంబై తో  స‌రితూగే స్థాయికి చేరాయ‌ని, రేపు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చాకా.. ఈ బూమ్ మ‌రింత ప‌తాక స్థాయికి చేరే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతూ ఉన్నారు.
Tags:    

Similar News