మిస్ సౌత్ ఇండియా 2022 విజేతగా వైజాగ్ అమ్మాయి

Update: 2022-08-04 09:55 GMT
అమృత్ వేణిలో విశాఖపట్నం అమ్మాయి చరిష్మా కృష్ణ మిస్ సౌత్ ఇండియా 2022 టైటిల్‌ను గెలుచుకుంది. మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2022 అందాల పోటీలో విజేతగా నిలిచింది.  దేబ్నితా కర్ మొదటి రన్నరప్‌గా, సమృద్ది శెట్టి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

ఈ పోటీ కొచ్చిలోని లే మెరిడియన్‌లో జరిగింది. మొత్తం ఐదు దక్షిణ భారత రాష్ట్రాల నుండి ఇరవై మంది యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో పెగాసస్ చైర్మన్ డాక్టర్ అజిత్ రవి కూడా పాల్గొన్నారు.

విశాఖపట్నంకు చెందిన చరిష్మా కృష్ణ ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థిని. ఆమె ఫైన్ ఆర్ట్స్ విభాగంలో చదువుతోంది.

ఆమె కుటుంబం విషయానికి వస్తే  చరిష్మా తండ్రి పేరు హరికృష్ణ. దాదాపు 30 రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు. చరిష్మా క్లాసికల్ డ్యాన్సర్. ఆమె గుర్రపు స్వారీ, స్విమ్మింగ్, నటనలో కూడా శిక్షణ పొందింది.

మిస్ సౌత్ ఇండియాగా నిలిచిన చరిష్మా ట్రోఫీతోపాటు రూ. 1,00,000  బహుమతిని అందుకుంది. మొదటి, రెండవ రన్నరప్‌లు వరుసగా రూ. 60,000 మరియు రూ. 40,000 బహుమతులు అందుకున్నారు.

చరిష్మా విషయానికి వస్తే.. ఆమె తండ్రి పేరు హరికృష్ణ. ఐదో తరగతి వరకూ అమెరికాలోనే చరిష్మా చదివింది. ఆ తర్వాత వీరి కుటుంబం విశాఖకు వచ్చి ఇక్కడే స్థిరపడింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు నృత్యకారిణిగా.. నటిగా ఛరిష్మా రాణిస్తోంది. చిన్ననాటి నుంచి క్లాసిక్ , ఫోక్, వెస్టన్ డ్యాన్స్ లు నేర్చుకుంటోంది. ఇప్పటివరకూ 30కు పైగా నృత్య ప్రదర్శనల్లో పాల్గొంది. అలాగే స్విమ్మింగ్, గుర్రపు స్వారీలోనూ శిక్షణ పొందింది.

ఇక స్టార్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు పొందిన ఎల్.సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. కాగా.. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లోనూ ఈ ముద్దుగుమ్మ నటించింది.
Tags:    

Similar News