బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం షెడ్యూల్ ప్రకారం గోవాలో ల్యాండ్ కావాల్సింది. కానీ.. అనూహ్యంగా ఈ విమానం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ల్యాండ్ కావటం కాస్తపాటి కలకలాన్ని రేపింది. రష్యా రాజధాని మాస్కో నుంచి బయలుదేరిన ఈ విమానం నేరుగా గోవాకు వెళ్లాల్సి ఉంది. అయితే.. అందుకు భిన్నంగా బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కావటంతో ఎయిర్ పోర్ట్ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది.
ఆరుగురు ప్రయాణించే అవకాశం ఉన్న అత్యంత అధునాతన.. విలాసవంతమైన ఫ్లైట్ లో పుతిన్ గోవాకు బయలుదేరారు. గోవాలోని వాస్కోలో ఉన్న దబోలిమ్ ఎయిర్ పోర్ట్ కు ఆయన చేరుకోవాల్సి ఉంది. అయితే.. అందుకు భిన్నంగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు ఆయన విమానం చేరుకోవటం కొద్దిపాటి కలకలం రేగింది. వాతావరణం అనుకూలించకపోవటంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారన్న వార్తలు వినిపించాయి. వాస్కోలో దట్టమైన పొగమంచు కప్పేయటంతో మరో మార్గం లేక బెంగళూరుకు విమానాన్ని తరలించినట్లుగా చెబుతున్నారు.
దాదాపు గంట పాటు బెంగళూరు విమానాశ్రయంలో పుతిన్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ ను నిలిపివేశారు. ఈ సమయంలో ఆయన ఫ్లైట్ కు ఇంధనాన్ని నింపటం గమనార్హం. షెడ్యూల్ కు భిన్నంగా పుతిన్ లాంటి ముఖ్యనేత ప్రయాణిస్తున్న విమానం బెంగళూరులో ల్యాండ్ కావటం చర్చనీయాంశంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/