అగ్ర దేశాల్లో పెద్ద దేశాల్లో రెండో టర్మ్ పవర్ ను చేజిక్కించుకోవడమే కష్టం. అలాంటిది ఒక నేత ఏకంగా ఇరవై సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతూ ఉన్నాడు. ఆయనే రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్! ఎప్పుడో 1999 లో అధికారాన్ని చేపట్టిన పుతిన్ అప్పటి నుంచి పవర్ సెంటర్ గా కొనసాగుతూ ఉన్నారు. రష్యాకు సంబంధించి అత్యున్నత అధికార పదవుల్లో ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఇరవై యేళ్లుగా రష్యాలో పుతిన్ కు తిరుగే లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
1999 లో అప్పటి ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలిగి పుతిన్ కు అధికార బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పుతిన్ కు తిరుగు లేకుండా పోయింది. ఇటీవలే వరసగా నాలుగో సారి పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం ఇంకా ఐదేళ్లు ఉంది. రెండు వేల ఇరవై నాలుగు వరకూ పుతిన్ పవర్ లో కొనసాగబోతూ ఉన్నారు.
అంటే పుతిన్ పాతికేళ్ల పాటు రష్యన్ సుప్రిమోగా కొనసాగనున్నట్టే. ఇదే పాతికేళ్లలో ఇండియాలో ఎన్నో పార్టీలు-కూటములు అధికారాన్ని మార్చుకున్నాయి. అమెరికాలో అనేక మంది అధ్యక్షులు మారారు. ఇంగ్లండ్ కు కూడా బోలెడంత మంది ప్రధానులు మారారు. అయితే పుతిన్ మాత్రం సూపర్ పవర్ గా కొనసాగుతూ ఉన్నారు!