ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. నలుగురికి సేవ చేయాల్సిన ఓ వాలంటీర్ నీఛ పనికి పాల్పడ్డాడు. ఒక గౌరవ ప్రదమైన స్థానంలో ఉంటూ తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళ చేయి పట్టుకున్నాడు వాలంటీర్. ఈ ఘటన కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం బి. కోడూరు గ్రామంలో చోటు చేసుకుంది.ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. ఆత్మకూరు మండలం బి. కోడూరు గ్రామానికి చెందిన మహిళను, అదే గ్రామానికి చెందిన వాలంటీర్ సుభాన్ కోరిక తీర్చాలని వేధించాడు. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు…వాలంటీర్ను అరెస్టు చేసినట్లు నంద్యాల సీఐ మల్లికార్జున తెలిపారు.
అయితే , సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేస్తున్న ఈ వాలంటీర్ వ్యవస్థ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో .. కొందరు ఇలాంటి పనులకి పాల్పడుతుండటంతో మొత్తం వాలంటీర్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది.