క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఓటేస్తే.. టిఫిన్, సినిమా ఫ్రీ.. నేత‌ల ఆఫ‌ర్లు కాదులే!

Update: 2023-05-09 15:31 GMT
ఎన్నిక‌లు అన‌గానే.. నేత‌లు ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. వారిని త‌మవైపు తిప్పు కొని ఎన్నిక్ల‌లో విజ‌యం ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తారు. ఈ క్ర‌మంలోనే అనేక ఆఫ‌ర్లు.. తాయిలాలు..పార్టీల ప‌రంగా.. వ్య‌క్తిగ‌తంగా అభ్య‌ర్థుల ప‌రంగా కూడా.. జోరుగా సాగుతాయి. ఇలానే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ, కాంగ్రెస్‌లు.. అనేక వ‌రాల జ‌ల్లులు కురిపించాయి. అయితే.. అభ్య‌ర్థులు కూడా.. వ్య‌క్తిగ‌తంగా స్థానిక సమ‌స్య‌ల ప‌రిష్కారంపై హామీలుగుప్పించారు.

ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారం ప‌రిసమాప్తి అయింది. తెల్ల‌వారితే.. అంటే బుధ‌వారం.. ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. ఇంత‌లో కొన్ని హోట‌ళ్లు బెంగ‌ళూరులో ఆఫ‌ర్ల‌పై ఆఫ‌ర్లు ప్ర‌క‌టించాయి. ''మీరు ఓటు వేసి.. సిరా గుర్తు చూపిస్తే.. మేం మీకు అదిరిపోయే టిఫెన్ ఆఫ‌ర్ చేస్తాం.'' అని కొన్ని.. మ‌రికొన్ని మీరు ఓటు వేసివ‌చ్చాక‌.. టిఫెన్‌.. టీతోపాటు సినిమా టికెట్లు కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించాయి. దీనివెనుక ఆయా హోట‌ళ్ల య‌జ‌మానులు పోలింగ్ శాతం పెంచేందుకే ఇలా చేస్తున్నామ‌ని చెబుతున్నారు.

కానీ, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం దీనిపై కొంత సందేహంతోనే ఉంది. ఎందుకంటే.. అలా ప్ర‌క‌టించిన హోట ళ్లు.. నిస‌ర్గ‌, సామ్రాట్‌, చాళుక్య వంటివి ఈ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించాయి. అయితే.. ఈ హోట‌ళ్ల య‌జ‌మానుల‌కు రాజ‌కీయ నేత‌ల‌కు సంబంధాలు ఉండ‌డంతో ఈ ఆఫ‌ర్ల వెనుక ఏదో వ్యూహం ఉంద‌ని అనుమానిస్తున్నారు.

అందుకే.. తాజాగా బెంగ‌ళూరు అధికారులు ఇలా ప్ర‌క‌టించ‌డానికి వీల్లేద‌ని.. ఇది ఎన్నిక‌ల నిబంధ‌నావ‌ళికి విరుద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.

అయితే.. ఇలా ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు కొత్త కాదు. 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ క‌ర్ణాట‌క‌లో ఐదు హోట‌ళ్లు ఏకంగా.. విందును ఆఫ‌ర్ చేశాయి. ఇటీవ‌ల గుజ‌రాత్‌లోనూ ప్ర‌ముఖ హోట‌ల్ కూడా.. ఇలానే ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇదిలావుంటే.. ఈ సారి.. క‌ర్ణాట‌క మ‌ఠాధిప‌తులు మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Similar News