తమకు ఓటేస్తే..పాక్ లో అణుబాంబు వేసినట్లేనన్న డిఫ్యూటీ సీఎం

Update: 2019-10-14 10:02 GMT
ఎన్నికల వేళ నేతల నోటి మాటలు కోటలు దాటటం ఇప్పటివరకూ తెలిసిన విషయమే. ఇప్పుడది కాస్తా అణుబాంబును కూడా దాటేస్తున్నాయి. తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర.. హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల వేళ.. పార్టీల ప్రచారం హద్దులు దాటేస్తోంది. కమలనాథులు సమరోత్సాహంతో చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్య కొత్త కలకలానికి తెర తీసింది.

ఓటర్లు తమ ఓటును కమలం గుర్తుకు వేస్తే.. పాకిస్తాన్ లో ఆటోమేటిక్ గా అణుబాంబు వేసినట్లేనంటూ వివాదాస్పద వ్యాఖ్య తీవ్ర కలకలానికి గురి చేస్తోంది. మహారాష్ట్రలోని థానే నగరంలో మీరా భయేందర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మెహతాకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

భావోద్వేగ వ్యాఖ్యలతో పాటు.. దేవతల్ని కూడా ఎన్నికల ప్రచారంలోకి తెచ్చేశారు. సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి సైకిల్.. చేతి మీద కూర్చోదని.. కమలం పువ్వు మీదనే కూర్చుంటుందన్న విషయాన్ని ఆయన పేర్కొనటం చూశాక.. కమలం గుర్తుకు ఈ రకంగా కూడా ప్రచారం చేయొచ్చా? అని ప్రత్యర్థి పార్టీలు అవాక్కు అవుతున్నాయి.
Tags:    

Similar News