డౌట్: ఓట్ల లెక్కింపు వేళ‌.. ఈవీఎంలు మొరాయిస్తే?

Update: 2019-04-30 08:54 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక్కో విడ‌త పోలింగ్ జ‌రుగుతుండ‌టం.. ఏపీతో స‌హా ప‌లు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఈవీఎంలు మొరాయించ‌టం తెలిసిందే. ఈవీఎం మిష‌న్లలో సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌టం చూస్తున్న‌దే. పోలింగ్ వేళ‌.. ఈవీఎంలు మొరాయిస్తే.. వాటిని సాంకేతిక నిపుణుల‌తో స‌రి చేయ‌టం తెలిసిందే. మ‌రి.. ఓట్ల లెక్కింపు వేళ‌.. ఈవీఎంలు మొరాయించి.. అందులో డేటా క‌నిపించ‌కుంటే ఏమ‌వుతుంది? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఇలాంటివేళ‌.. ఎన్నిక‌ల సంఘం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న సందేహానికి స‌మాధానం చెబుతున్నారు ఏపీ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారిక గోపాల‌కృష్ణ ద్వివేది. ఈవీఎంల‌లో పోలైన ఓట్ల‌తో.. వీవీ ప్యాట్ ల‌లోని స్లిప్పులు స‌రిపోతేనే.. ఎన్నిక‌ల ఫ‌లితాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చెప్పారు.
 
ఇదిలా ఉంటే.. పోలింగ్ లో మాదిరి కౌంటింగ్ స‌మ‌యంలో ఈవీఎంలు ప‌ని చేయ‌కుంటే.. ప‌ని చేయ‌ని ఈవీఎంల‌లో న‌మోదైన ఓట్లు.. విజేత ఓట్ల కంటే త‌క్కువ‌గా ఉంటే.. స‌ద‌రు అభ్య‌ర్థిని విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. ఒక‌వేళ‌..ప‌ని చేయ‌ని ఈవీఎంల‌లో పోలైన ఓట్ల కంటే మెజార్టీలో ఉన్న అభ్య‌ర్థికి వ‌చ్చిన ఓట్ల కంటే త‌క్కువ‌గా ఉంటే మాత్రం రీపోలింగ్ నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు ఏ అనే నియోజ‌క‌వ‌ర్గంలో సుబ్బారావు అనే అభ్య‌ర్థికి ఐదు వేల ఓట్లు అధిక్య‌త‌లో ఉన్నార‌ని అనుకుందాం. అయితే.. అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మూడు ఈవీఎంలు ప‌ని చేయ‌లేద‌నుకుందాం. మూడు ఈవీఎంల‌లో పోలైన ఓట్లు 3500 ఉన్నాయ‌ని అనుకుందాం. మొత్తం మెజార్టీ 5వేల కంటే.. ప‌ని చేయ‌ని మూడు ఈవీఎంల‌లో పోలైన ఓట్లు త‌క్కువ‌గా ఉండ‌టంతో.. సుబ్బారావును విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. ఒక‌వేళ‌.. ప‌ని చేయ‌ని ఈవీఎంలు ప‌ది ఉన్నాయ‌నుకుందాం. అందులో పోలైన ఓట్లు 12 వేలు అనుకుందాం. అప్పుడు.. సుబ్బారావును విజేత‌గా ప్ర‌క‌టించ‌కుండా.. ఎన్నికను ర‌ద్దు చేసి.. రీపోలింగ్ నిర్వ‌హిస్తార‌న్న మాట‌. పోటాపోటీగా సాగిన ఏపీ ఎన్నిక‌ల్లో.. ఈవీఎంల‌కు సంబంధించిన సాంకేతిక స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా రావ‌టం తెలిసిందే. ఒక‌వేళ‌.. ఓట్లు లెక్కింపు వేళ ఈవీఎంలు ప‌ని చేయ‌కుంటే..  రాజ‌కీయ పార్టీల‌కు కొత్త త‌ల‌నొప్పి షురూ అయిన‌ట్లే. 
Tags:    

Similar News