భారత్ - పాకిస్థాన్ సరిహద్దు మరోమారు ఉద్రిక్తంగా మారుతోంది. అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి 190 కిలోమీటర్ల మేర పాకిస్థాన్ గస్తీని పెంచడంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్ రేంజర్ల స్థానంలో ఆర్మీ సైన్యాన్ని మోహరించడమే కాకుండా భారీ స్థాయిలో ఆయుధాలను సమకూర్చుకుంటుండటంతో భారత్ సైతం అందుకు తగిన విధంగా సిద్ధమవుతోంది.
ఉరీ దాడి జరిగినప్పటి నుంచి సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన నెల రోజుల నుంచి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దులోని భారత సైనిక శిబిరాలతో పాటు జమ్మూలోని పలు నివాసాలపై కాల్పులు జరుపుతోంది. ఈ క్రమంలోనే పాక్ చర్యలను తిప్పికొట్టేందుకు భారత సైన్యం ప్రత్యేక పారా మిలటరీ దళాలను బోర్డర్ వెంబడి మోహరించింది. దీంతో భారత భద్రత దళాల(బీఎస్ ఎఫ్)ను దీటుగా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సైనికుల సంఖ్యను పెంచి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల వల్ల సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెడుతున్నప్పటికీ రక్షణ రేఖ వెంట ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేని పరిస్థితి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/