సంబంధం లేని విషయాల్లోకి ఆంధ్రోడివంటూ మాట్లాడటం తెలంగాణలో కనిపిస్తోందని వాపోయే వారికి సరైన ఆధారం దొరికినట్లే. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారే ప్రాంతీయ భావనల్ని బయటకు తీసి వ్యాఖ్యలు చేస్తున్న తీరు చూస్తే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్న వాదన వినిపిస్తోంది. ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి ఒక ఉన్నతాధికారి.. ఆంధ్రావాడివా? తెలంగాణవాడివి కాదా? అంటూ ప్రశ్నించిన వైఖరి చూస్తే.. సంబంధం లేని ఇష్యూలో ఆంధ్రావాడివా? అంటూ ప్రశ్నించటం ఆంధ్రాప్రాంతం వారిని అవమానించటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి.. బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం.. ఆంధ్రావాడివా? అంటూ ఎన్నికల అధికారి మాట్లాడటం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మజ్లిస్ రౌడీయిజంపై ఎన్నికల సంగం అధికారులకు ఫిర్యాదు చేసేందుకు అఖిలపక్ష నేతలు వెళ్లారు. కాంగ్రెస్.. టీడీపీ.. బీజేపీకి చెందిన నేతలు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డిని కలిసిన నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని నేతలు వివరించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పోలింగ్ లో పోలీసులు.. ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేశాయని.. గులాబీ చొక్కాలు వేసుకున్నవారిలా వ్యవహరించారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నాగిరెడ్డి.. ‘‘ఏం మాట్లాడుతున్నవ్ నువ్వు?’’ అంటూ అన్నారు.
‘‘నువ్వు అంటూ ఏకవచనంలో పిలుస్తున్నావేంటి?.. ఎమ్మెల్యే అన్న గౌరవం లేదా?’’ అంటూ చింతల ప్రశ్నించారు.
‘‘తెలంగాణవాడివి కాదా? ఆంధ్రావాడివా? బుద్ధులు మార్చుకోవా?’’ అంటూ నాగిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగిన సమయంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి.. షబ్బీర్ అలీ జోక్యం చేసుకొని ఇరువురికి సర్ది చెప్పారు. సంబంధం లేని విషయంలో ఆంధ్రా.. తెలంగాణ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఎన్నికల అధికారి నాగిరెడ్డికి ఏమిటన్న విమర్శ వినిపిస్తోంది.