కరోనా వైరస్ .. కరోనా వైరస్ .. గత కొన్ని నెలలుగా ఆ దేశం , ఈ దేశం అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి కట్టడికి మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. దీనితోనే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదనే చెప్పాలి. అయితే కొన్నిచోట్ల మాత్రం జనాలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అందదూ వ్యాక్సిన్ వేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు కొత్త ఐడియాలు, గిఫ్ట్‌లతో ప్రజల ముందుకు వస్తున్నాయి. లక్కీ డ్రాలు, గిఫ్ట్ కార్డులను అందజేస్తామని ప్రకటించిన సందర్భాలను చూశాం. మరోవైపు కొన్ని ప్రైవటే సంస్థలు కూడా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి..ఆఫర్లు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి.
అయితే తాజాగా ఓ ప్రభుత్వం.. వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకన్న టీనేజర్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. అలాంటి వారికి యాపిల్ ఎయిర్ ప్యాడ్స్ అందించనున్నట్టు అమెరికాలోని వాషింగ్టన్ తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్ మేయర్, మురియల్ బ్రౌజర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ కూడా చేశారు. ‘మీరు వాషింగ్టన్ లో నివసిస్తున్నారా, మీరు ఇంకా మీ డోస్ట్ వ్యాక్సిన్ తీసుకోలేదా అయితే మీరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నవారికి యాపిల్ ఎయిర్ పాడ్స్ అందజేయనున్నట్టు పేర్కొన్నారు. అదృష్టం కలిసొస్తే 25 వేల డాలర్ల స్కాలర్ షిప్ అందచేస్తామని లేదా ఐప్యాడ్ కూడా దక్కే అవకాశం ఉందని కూడా చెప్పారు. వాషింగ్టన్ లో నివాసం ఉంటూ.. 12-17 మధ్య వయసు వారు.. ఎవరైతే బ్రూక్ లాండ్ ఎంఎస్, సౌసా ఎంఎస్, జాన్సన్ ఎంఎస్‌లలో వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్లకు ఎయిర్ పాడ్స్ ఇస్తాం. అయితే వ్యాక్సిన్ వేయించుకునేవాళ్లు స్టూడెంట్ అయి ఉండి.. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకునేవారికి ఇది వర్తించనున్నది. వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు స్టూడెంట్ అని చెప్పడానికి తాగిన గుర్తింపు కార్డులను చూపించాల్సిఉంటుందందని మేయర్ తెలిపారు.