అదేంటి తాజ్ మహల్ ని ఒవైసీ ముత్తాతలు కట్టించారా అని ఆశ్చర్య పోతున్నారా? అయితే పూర్తిగా చదవండి మీకే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం దేశం లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు ఎంతగా ఆందోళనలు చేపడుతున్నప్పటికీ కూడా కేంద్రం మాత్రం ఈ చట్టం పై వెనక్కి తగ్గేదే లేదు అని చెప్తుంది. ఇకపోతే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని అక్బరుద్దీన్ ఒవైసీ కేంద్రం పై గట్టిగా పోరాడుతున్నారు. ఈ సమయంలోనే 800 సంవత్సరాల కిందటే ముస్లింలు భారతదేశాన్ని పరిపాలించారంటూ అక్బరుద్దీన్ ఒవైసీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఈ నేపథ్యం లో ఒవైసీపై షియా వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వి ఘాటు విమర్శలు చేసారు. భారత్ ని 800 సంవత్సరాల కిందటే ముస్లింలు పరిపాలించారు అన్న మాటలకి కౌంటర్ ఇస్తూ .. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో గల తాజ్ మహల్‌ను ఒవైసీ ముత్తాతలే కట్టించారని , తమ లైలా కోసం వారు తాజ్‌మహల్‌ను నిర్మించారని ఎద్దేవా చేశారు.
తన సామాజిక వర్గం 800 సంవత్సరాలు కిందటే ఈ దేశాన్ని పరిపాలించిందని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని ఒవైసీ చెప్పారు. అలాంటి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు.. తాము భారతీయులమని నిరూపించకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లను చూపాలని అడగడం సరి కాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఇదివరకే అక్బరుద్దన్‌పై విమర్శల జడివాన కురిపించారు. తాజాగా వసీం రిజ్వీ కూడా అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానాలను తప్పుపట్టారు. ఒవైసీ ముత్తాతలే తాజ్ మహల్ ను కట్టించారని చురకలు అంటించారు. ముస్లిం పరిపాలకులు హిందూ ఆలయాలను పడగొట్టించి.. దాని స్థానంలో తాజ్ మహల్ ను కట్టారని ఆరోపించారు.