భగభగమండే ఎండాకాలం.. చెరువులు - చెలమలు ఎండిపోయాయి! ఎక్కడ చూసినా నీటి కష్టాలే. ఒక్క బిందె నీళ్ల కోసం పానీ పట్టు యుద్ధాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ ల కోసం మంచి నీళ్లను వాడుతుండడం పెద్ద దుమారమే రేపింది. వేలాదిమందికి సరిపడే నీరు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కు ఖర్చు చేస్తుంటే ఎవరికైనా కాలుతుంది. దీంతో చివరికి కోర్టులు కలగజేసుకుని అక్షింతలు వేసే పరిస్థితి వచ్చింది. ఇండియన్ ప్రిమియర్ లీగ్ మ్యాచ్ ల కోసం స్టేడియాల్లో నీటి వాడకంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒకవైపు నీటి కోసం ప్రజలు అల్లల్లాడుతుంటే మరోవైపు క్రికెట్ కోసం మంచి నీటిని ఎలా వృథా చేస్తారని జనం మండిపడ్డారు. దీనిపై కొందరు కోర్టుకు కూడా ఎక్కారు.
గత నాలుగు రోజులుగా జనాలు నీళ్ల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ నేపథ్యంలో క్రికెట్ మైదానం కోసం నీటిని ఎలా ఉపయోగిస్తారని.. ఇది అన్యాయమైన వృథా అని బొంబే హైకోర్టు అభిప్రాయపడింది.
క్రికెట్ కోసం ఎంత నీరు ఖర్చవుతోంది..
- పిచ్‌లను తడపడానికి - మైదానం మొత్తం శుభ్రంగా ఉంచడానికి కావాల్సిన నీళ్లు మొత్తం 3 లక్షల లీటర్లు
- ఈ ఐపీఎల్ సీజన్ లో మహారాష్ట్రలో ఆడుతున్న మ్యాచ్ లు 20
- 20 * 3= 60 లక్షల లీటర్లు (మైదానం - పిచ్ ల కోసం వాడే నీళ్లు)
- ఐపీఎల్ మ్యాచ్ ల కోసం వాడుతున్న 60 లక్షల లీటర్ల నీళ్లు ఒక రోజుకు 45 వేల మంది ప్రజల వాడకానికి సరిపోతాయి
ఐపీఎల్ లో వృథా ఎక్కడ అవుతోంది..
- ముంబయి వాంఖడె మైదానంలో 8 మ్యాచ్ లు
- పుణె - మహారాష్ట్ర క్రికెట్ మైదానంలో 9 మ్యాచ్ లు
- విదర్భ క్రికెట్ మైదానంలో 3 మ్యాచ్ లు
మహారాష్ట్రలో ఇప్పడు నీటి కరవు ఎలా ఉందంటే...
మహారాష్ట్రలో కొంత కాలంగా తీవ్రమైన నీళ్ల సమస్య నెలకొంది. చాలా ప్రాంతాల్లో రోజుల తరబడి నీళ్లు రాని పరిస్థితి. ఒకరోజు నీళ్లు వచ్చాయంటే ఆ రోజు పెద్ద పండగే. లాతూరుకు రైళ్లలో నీళ్లను తీసుకెళ్తుండడం సమస్య తీవ్రతకు నిదర్శనం.
- థానె - నవీ ముంబయిలో వారానికి మూడుసార్లు మాత్రమే నీటి సరఫరా ఉంటుంది.
- ఇక లాతూర్ లో సగటున 20 రోజులకు ఒకసారి మాత్రమే జనాలు నీళ్ల ముఖం చూస్తున్నారు.
అతి పెద్ద సమస్య..
నీటి కరవుతో సాధారణ ప్రజలతో పాటు వ్యవసాయదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. పచ్చగా పండాల్సిన పంటలు నీళ్లు లేక ఎండిపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా బలవణ్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూపోతోంది.
- 2015లో నీటి కరవు వల్ల దేశవ్యాప్తంగా 3000 వేల మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు
- గత మూడు నెలల్లో 57 మంది అన్నదాతలు ఈ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు
- ఈ బలవ్మరణాల్లో 34 శాతం మహారాష్ట్ర నుంచే ఉన్నాయి
క్రికెట్ లో డబ్బు మంచినీళ్ల ప్రవాహమే...
ఐపీఎల్ మ్యాచ్ ల వల్ల బీసీసీఐ పొందే ఆదాయం మహారాష్ట్ర ప్రభుత్వ క్రీడల బడ్జెట్ రూ.490 కోట్ల కన్నా ఎక్కువే! ఇంత ఆదాయం వస్తున్న నేపథ్యం నీటి కోసం మ్యాచ్ లను పోగొట్టుకునే ఉద్దేశం బీసీసీఐకి లేదు. ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి వచ్చే ఆదాయం ఏడాది ఏడాదికి గణనీయంగా పెరుగుతోంది.
- 2012-13 సీజన్ కు బీసీసీఐ ఆదాయం రూ.832 కోట్లు.
- 2013-14 సీజన్ కు ఆదాయం రూ.1194 కోట్లు
- 2014-15 సీజన్ కు ఆదాయం రూ.1000 కోట్లు
- 2015-16 సీజన్ కు ఆదాయం రూ.1200 కోట్లు
క్రికెట్ మ్యాచ్ లు చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. నేరుగా చూడటాన్ని మరింత ఇష్టపడతాడు. కానీ మహారాష్ట్రలోని తాజా పరిణామాల నేపథ్యంలో క్రీడల్లో మరో కోణం బయటపడింది. ఆనందాన్ని పంచే మ్యాచ్ ల కన్నా ప్రజల అవసరాలే ప్రధానమని రుజువైంది.
----- గరుడ