తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం మాత్రం ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తూనే ఉంది. నేటికి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇరురాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన కేంద్రం సైతం రాజకీయాలకు పాల్పడుతూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న ఆవేదన రాజకీయవర్గాల్లో నెలకొంది. జలవివాదాన్ని పరిష్కరించకుండా ఒక ప్రాంతానికి అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నీటి సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారుతోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి కంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాకే ఇరురాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయనేది వాస్తవం. ఈ సమయంలో కృష్ణా జలాల వివాదం ఇరురాష్ట్రాల సీఎంల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. ఇరుప్రాంతాల ముఖ్యమంత్రులు తమ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉండటంతో జలవివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. అగ్నికి అజ్యం పోసినట్లుగా కేంద్రం ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు యత్నిస్తుండటం శోచనీయంగా మారింది.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తాగునీటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అటూ తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటూ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సాగునీటికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నారు. ఇంకోవైపు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని తరలించి రాయలసీమలో కరువుఛాయలు దూరం చేసేందుకు భగీరథ యత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ ఇటీవలే అనుమతి కూడా ఇచ్చింది. రాయలసీమ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదని తేల్చిచెబుతూ ప్రాజెక్టు పనులకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే తెలంగాణ నుంచి వ్యతిరేక రావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. తెలంగాణ కాంగ్రెస్ హైకోర్టుకెక్కింది. ఇవన్నీ విచారణ జరగాల్సి ఉంది. ఈలోగా ఎన్జీటి ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ ప్రక్రియను ముగించింది.
ఈనేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం వేచి చూస్తున్న బీజేపీకీ కృష్ణా జలాల వివాదం కలిసి వచ్చింది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం హడావుడిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి అపెక్స్ కౌన్సిల్ కోవిడ్ సమయంలోనూ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడివారు అక్కడే ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించింది. 25న అపెక్స్ కమిటీ బాడీ సమావేశానికి ఇరు రాష్ట్రాల సీఎంలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత టిఆర్ఎస్ తో బిజెపికి సంబంధాలు పూర్తిగా బెడిసి కొట్టగా ఏపీలో అంతంత మాత్రంగా ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు ఉండటంతో ఈ వ్యవహారంలో తెలంగాణకు కేంద్రం అనుకూలంగా వ్యవహరించి లబ్ధిపొందేందుకు ప్లాన్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించవద్దని కేంద్రం ఆదేశించింది. ఈ వ్యవహరాన్ని కేంద్రం తన కనుసన్నల్లో ఉంచుకొని తెలంగాణలో బలపడేందుకు చూస్తోంది. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఆ ప్రాంతంలో లబ్ధి పొందేందుకు యత్నిస్తుందనే టాక్ విన్పిస్తోంది.
ఇలా రాయలసీమకు నీళ్లు అందకుండా.. ఏపీకి న్యాయం కాకుండా బీజేపీ వ్యవహరిస్తుందనే అనుమానాలు ఏపీ ప్రజల్లో కలుగుతున్నాయి. అయితే ఇద్దరు సీఎంలు ఇప్పటికే బీజేపీ వ్యూహాన్ని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అపెక్స్ బాడీ కమిటీలో ఇద్దరు సీఎంలు సామరస్యంగా సమస్యను పరిష్కరించేకునేందుకు సిద్ధం అవుతున్నారనే టాక్ విన్పిస్తోంది. దీంతో కృష్ణా జలాల వివాదంలో ఇద్దరు సీఎంలు కేంద్రానికి ఛాన్స్ ఇస్తారా? లేదా అన్నది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.