టెక్నాలజీ: ఇక పుష్కర స్నానం సేఫ్టీ

Update: 2015-07-15 16:10 GMT
గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్బంగా రాజ‌మండ్రి వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 27 మంది మ‌ర‌ణించ‌డం అంద‌రి మ‌న‌సుల‌ను క‌లచివేసింది. అంత భారీ స్థాయిలో జ‌న‌సందోహం రావ‌డం వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని కొంద‌రు వ్యాఖ్యానించ‌గా... అక్క‌డి భ‌క్తుల‌ వివ‌రాలు తెలిసి ఉంటే ఈ పరిస్థితి వ‌చ్చేది కాద‌ని ప‌లువురు విశ్లేషించారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం లేటుగా అయినా లేటెస్టుగా నిర్ణ‌యం తీసుకుంది.

పుష్క‌రాల నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ సైట్ ద్వారా ప్ర‌స్తుతం రాజ‌మండ్రిలోని ఆయా ఘాట్‌ల వ‌ద్ద ఏ ఘాట్‌లో ఎంత ర‌ద్ది ఉందో తెల‌సుకోవ‌చ్చు. ఎప్ప‌టిక‌పుడు స‌ద‌రు స‌మాచారం అప్‌డేట్ అవుతుంది. త‌ద్వారా రియ‌ల్‌టైమ్ డాటా ఉండ‌టంతో...భ‌క్తులు ఏ ఘాట్‌కు వెళ్లాలో నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.  

త్వ‌ర‌లో ఏపీలోని మిగ‌తా ఘాట్‌ల‌ను కూడా ఈ వెబ్‌సైట్ లో అప్‌డేట్ చేసే విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం వేస్తోంది. మొత్తంగా...సూప‌ర్ అప్‌డేట్స్ తో ఇటు భ‌క్తుల‌కు...అటు పుష్క‌రాల ఏర్పాట్ల‌లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా టెక్నాల‌జీతో కూడిన ప‌రిష్కారం తేవ‌డం సంతోష‌క‌ర‌మే. దీనిని తయారుచేయడంలో హైదరాబాదు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు టెక్నాలజీ సాయం అందించారు. ఏదేమైనా ఇది చాలా మంచి పరిష్కారాల్లో ఒకటి. ఈ టెక్నాలజీ వల్ల భక్తులు రద్దీ తక్కువగా ఉండే ఘాట్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.

website link:  http://lsi.iiit.ac.in/godavaripushkaralu/pages/clustermap.html
Tags:    

Similar News