దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత పశ్చిమ బెంగాల్ ఫలితం మీద ఉంటే.. రెండోది తమిళనాడు మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ గడ్డ మీద బీజేపీ జెండాను ఎగురవేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో తమ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరే అవకాశం లేదని అధికార టీఎంసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. త్వరలో జరిగే బెంగాల్ ఎన్నికలు హోరాహోరీగా సాగటం ఖాయమంటున్నారు.
ఇదిలా ఉంటే..తమిళనాడు రాజకీయం ఈసారి గందరగోళంగా మారింది. అమ్మ బతికి ఉన్న రోజుల్లో.. పోటీ రెండు పార్టీల మధ్యే ఉండేది. డీఎంకే.. అన్నాడీఎంకే మధ్యే రాజకీయ రగడ నడిచేది. సాధారణంగా ఒక దఫా ఒక పార్టీ గెలిస్తే.. రెండో దఫా రెండో పార్టీ విజయాన్ని సాధించటం రివాజుగా ఉండేది. అందుకు భిన్నంగా వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న అమ్మ.. అనుకోని రీతిలో అకాల మరణం చెందటం తెలిసిందే. తర్వాతి రాజకీయ పరిణామాలు మారగా.. డీఎంకే అధినేత కరుణ సైతం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో..ఈసారి ఎన్నికలు ఎలా సాగుతాయి? అంతిమ విజయం ఎవరిదన్న దానిపై ఆసక్తికరచర్చ నడుస్తోంది.
బీజేపీ.. అన్నాడీఎంకే కలిసి పోటీ చేయాలని చూస్తుంటే.. వారికి జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళ దెబ్బేయాలన్న యోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. రాజకీయ పార్టీ పెట్టిన నటుడు కమల్ హాసన్.. ఈసారి ఎన్నికల్లో తన సత్తా చాటాలని తెగ ఆరాటపడుతున్నారు. అయితే.. ఆయనకు అవకాశాలు తక్కువంటున్నారు. డీఎంకే విషయానికి వస్తే.. స్టాలిన్ రాజకీయ భవిష్యత్తుకు పరీక్షగా మారిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపే వీలుందంటున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ.. అలియాస్ చిన్నమ్మ ఈ నెల 27న విడుదల కానున్నారు. ననననప్రజా జీవితంలోకి తిరిగి రానున్న ఆమెకు అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ప్లాన్ చేస్తున్నారు. జైలు నుంచి చెన్నైకు ఏకంగా వెయ్యి వాహనాలతో ఆమెకు వెల్ కం చెప్పాలనుకుంటున్నారు.
రీఎంట్రీ అదిరిపోయేలా ఉండాలంటున్నారు. అంతేకాదు.. తన నివాసాన్ని తన నెచ్చెలి జయలలిత ఉన్న పోయెస్ గార్డెన్ లోనే ఉండాలని భావిస్తున్నారు. ఇందుకోసం 30వేల చదరపుఅడుగుల విస్తీర్ణంలో భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. చిన్నమ్మ జైలు నుంచి విడుదల అయ్యే నాటికి భవన నిర్మాణం పూర్తి కాదని.. అందుకే ఆమెను టీ నగర్లోని బంధువుల ఇంటి ఎదురుగా మరో ఇంటిని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చిన్నమ్మ జైలు నుంచి విడుదలైన వెంటనే తమిళనాడురాజకీయాల్లో నెలకొన్న స్తబ్దత పూర్తిగా పోయి.. రోజుకో సంచలనం వార్తలకే ఎక్కువ అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.