నిమ్మగడ్డకు ఇంత అవమానమా ?

Update: 2021-03-31 06:40 GMT
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డకు పెద్ద అవమానమే ఎదురైనట్లు సమాచారం. గవర్నర్ ను కలవాలని నిమ్మగడ్డ అపాయిట్మెంట్ అడిగితే రాజ్ భవన్ వర్గాలు ఏమాత్రం స్పందించలేదని సమాచారం. బుధవారం సాయంత్రానికి నిమ్మగడ్డ కమీషనర్ గా రిటైర్ అయిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. పదవీ విరమణకు ముందుగా చివరిసారి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలుద్దామని నిమ్మగడ్డ అనుకున్నారు.

అయితే అందుకు గవర్నర్ సానుకూలంగా  స్పందించలేదని తెలిసింది. అపాయిట్మెంట్ కోసం నాలుగురోజుల ముందే నిమ్మగడ్డ సంప్రదించినా రాజ్ భవన్ వర్గాలు మంగళవారం సాయంత్రానికి కూడా  ఏ సంగతి చెప్పలేదట. ఇదే విషయాన్ని మంగళవారం రాజ్ భవన్ ఉన్నతాధికారులను నిమ్మగడ్డ  సంప్రదించినా సరైన సమాధానం రాలేదని తెలిసింది. దీనికి కారణం నిమ్మగడ్డ వైఖరే ప్రదాన కారణమని సాక్షి మీడియా చెప్పింది.

సదరు మీడియా ప్రకారం ఈనెల 19వ తేదీన తనను కలవాల్సిందిగా గవర్నర్ ఆదేశాలను నిమ్మగడ్డ పట్టించుకోలేదట. తాను హైదరాబాద్ లో ఉన్నట్లు సమాధానమిచ్చారని సమాచారం. పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసమే గవర్నర్ తనను కలవమన్నారని ఆదేశించినట్లు నిమ్మగడ్డ గ్రహించారట. అయితే పరిషత్ ఎన్నికలను నిర్వహించే ఆలోచన లేకపోవటం వల్లే గవర్నర్ ను నిమ్మగడ్డ కలవలేదని తెలిసింది.

తనను వచ్చి కలవాల్సిందిగా ఆదేశించినా నిమ్మగడ్డ లెక్క చేయకపోవటాన్ని గవర్నర్ చాలా సీరియస్ గా తీసుకున్నారట. అందుకనే నాలుగు రోజులుగా అడుగుతున్నా నిమ్మగడ్డకు అపాయిట్మెంట్ ఇవ్వలేదట. మంగళవారం రాజ్ భవన్ నుండి కబురు వస్తుందన్న నమ్మకంతోనే రోజంగా నిమ్మగడ్డ తన కార్యాలయంలోనే ఉండిపోయారట. అయినా ఎలాంటి కబురురాలేదని సమాచారం. దాంతో నిమ్మగడ్డను కలవటానికి గవర్నర్ ఇష్టపడలేదని అర్ధమవుతోంది.
Tags:    

Similar News