వ‌రుస‌గా ఆడ‌పిల్ల‌లు.. ఆ తండ్రి ఎంత దారుణానికి పాల్ప‌డ్డాడంటే!

Update: 2022-11-08 17:30 GMT
ఆయ‌న యువ‌కుడు. చిన్న వ‌య‌సులోనే పెళ్లి అయి ఉండొచ్చు. దీంతో కేవ‌లం 38 ఏళ్ల‌కే న‌లుగురు బిడ్డ‌ల‌కు తండ్రిఅయ్యాడు. అయితే.. వ‌రుస‌గా ఈ న‌లుగురు పిల్ల‌లు కూడా ఆడ‌పిల్ల‌లే కావ‌డం.. ఆ యువ‌కుడిని మాన‌సికంగా కుంగ‌దీసింది. నిజానికి ఇప్పుడు ప్ర‌భుత్వాలు ఆడ‌పిల్ల‌లకు అండ‌గా ఉంటున్నాయి. కొన్ని కొన్ని ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌వేశ పెట్టి ఆదుకుంటున్నాయి. మ‌రి ఈ విష‌యాలు తెలుసో.. తెలియ‌దో కానీ, స‌ద‌రు యువ‌కుడు మాత్రం ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. త‌న ప్రాణాలు త‌నే తీసుకుని.. న‌లుగురు ఆడ‌బిడ్డ‌ల‌ను అనాథ‌ల‌ను చేశాడు.

ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కర్ణాటక లోని కోలార్ జిల్లాలో ఉన్న శెట్టిహళ్లి ప్రాంతానికి చెందిన లోకేశ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి ఆంధ్రప్రదేశ్లోని పుంగనూరుకు చెందిన శిరీషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ నెల 4న లోకేశ్ భార్య శిరీష మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్ప‌టికే ఆడ‌పిల్ల‌లు పుట్టారంటూ.. నిత్యం లోకేశ్ బాధ‌ప‌డుతుండేవాడు. ఇక‌, నాలుగోసారి కూడా ఆడ‌పిల్ల పుట్ట‌డంతో ఆయ‌న తీవ్ర ఆవేద‌న చెందాడు.

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన లోకేష్‌.. తన తల్లిని తమ్ముడు మంజునాథ్ ఇంటికి పంపించేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లోకేశ్ తల్లి ఇంటికి వచ్చి చూడగా కుమారుడు విగతజీవిగా కనిపించాడు. వెంటనే లోకేశ్ తమ్ముడు మంజునాథ్‌కు సమాచారం అందించింది. అప్పటికే లోకేశ్ మరణించాడు. ఫ‌లితంగా.. భార్య‌, న‌లుగురు ఆడ‌పిల్ల‌లు కూడా అనాథ‌ల‌య్యారు.

కుమార్తె గొంతునులిమి.. రాజస్థాన్ కోటాలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ.. కుమార్తె పట్ల దారుణంగా ప్రవర్తించింది. రేఖా కన్వర్(38) అనే మహిళ తన 13 ఏళ్ల కూతురిని టవల్తో గొంతు నులిమి హత్య చేసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.  రేఖా కన్వర్.. శివరాజ్ సింగ్ అనే ఆటో డ్రైవర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. రేఖ.. మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో తన కుమార్తె మెడపై టవల్తో గట్టిగా నులిమి హత్య చేసింది.

ఆ సమయంలో నిందితురాలి పెద్ద కుమారుడు నాగేంద్ర(16) పాఠశాలకు వెళ్లాడు. ఆమె చిన్న కుమారుడు సింగం ఇంట్లోనే ఉన్నాడు. తన తల్లి.. సోదరిపై దాడి చేయడం చూసి ఇంటి బయటకు వెళ్లి ఇరుగుపొరుగువారిని పిలిచాడు. ఇరుగుపొరుగు వారు బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. అయితే అప్ప‌టికే బాలిక అప‌స్మార‌క స్థితికి జారుకుంది. దీంతో స‌మీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News