తాజాగా రోనాల్డో-కోకా కోలా వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. యూరో ఫుట్ బాల్ చాంపియన్ షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రోనాల్డో తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి.. మంచినీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని మీడియా సాక్షిగా సూచించడం సంచలనమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రోనాల్డో లాంటి స్టార్ ఆటగాడు కోకా కోలా తాగవద్దని అనడంతో కోకాకోలా కంపెనీ షేర్లు కుప్పకూలాయి. ఏకంగా 29వేల కోట్ల నష్టం కోకా కోలాకు వాటిల్లింది.
ఆసక్తికరమైన ప్రకటనలతో భారత్ లో ఫెవికాల్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.. తాజాగా ఈ రోనాల్డో-కోకా కోలా వివాదాన్ని కూడా ఫెవికాల్ తనకు అనుకూలంగా మలుచుకోవడం విశేషం.
తాజాగా ఫెవికాల్ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. అది కాస్త వైరల్ గా మారింది. 'రోనాల్డో హాజరైన ప్రెస్ మీట్ ను పోలి ఉన్న ఫొటోలో, కోకా కోలా బాటిళ్లకు బదులు ఫెవికాల్ డబ్బాలను ఏర్పాటు చేసింది. 'వీటిని ఎవరూ అక్కడి నుంచి తీయలేరు' అని.. కంపెనీ షేర్ విలువ కూడా పడిపోయేది కాదని వ్యంగ్యంగా కోకాకోలాకు సెటైర్లు వేసింది. కోకాకోలా బాటిళ్లు అక్కడ తీయకుండా ఉండేందుకు ఫెవికాల్ అంటించి ఉంటే కోకాకోలాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొంది.
ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఇప్పుడు ఫెవికాల్ యాడ్ కు ఫిదా అయిపోయారు. ఏమా సృజనాత్మకత అంటూ రీట్వీట్లలో షేర్లు చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫెవికాల్ ఇప్పుడే కాదు... సమయానుకూలంగా మంచి క్రియేటివిటీ యాడ్స్ చేస్తూ మార్కెట్ విలువను పెంచుకుంటోంది.