వాట్ యాన్ ఐడియా సర్ జీః 13ఏళ్ల కిందటి యాడ్ ఇప్పుడు వైరల్!

Update: 2021-05-26 16:50 GMT
సోష‌ల్ మీడియా విస్తృతం అయిన త‌ర్వాత.. ఏ విష‌యం ఎప్పుడు వైర‌ల్ అవుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. దశాబ్దాలు.. శతాబ్దాల నాటి విషయాలు కూడా ఆన్ లైన్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 17 సంవ‌త్స‌రాల కింద‌టి మెగాస్టార్‌ చిరంజీవి థ‌మ్స్ అప్ యాడ్ ఈ మ‌ధ్య వైర‌ల్ అయ్యింది. తాజాగా.. 13 సంవత్సరాల కిందటి యాడ్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

అప్ప‌ట్లో ఓ మొబైల్ నెట్వ‌ర్క్ అడ్వ‌ర్టైజ్ మెంట్‌ కోసం షూట్ చేసిన యాడ్ అది. అందులో బాలీవుడ్ స్టార్ అభిషేక్ బ‌చ్చ‌న్ క‌నిపిస్తారు. ''వాట్ యాన్ ఐడియా స‌ర్ జీ'' అంటూ వచ్చిన ప్రకటన చాలా ఫేమస్ అయ్యింది. ఇందులో అభిషేక్ ఓ ఉపాధ్యాయుడిగా క‌నిపిస్తారు. ఓ నిరుపేద బాలిక‌కు స్కూల్లో అడ్మిష‌న్ దొర‌క‌దు. అయితే.. మొబైల్ ఇంట‌ర్నెట్ ద్వారా వాళ్ల ఊరిలో ఆన్ లైన్ క్లాసులు నిర్వ‌హిస్తారు. అలా చ‌దువుకున్న ఆ బాలిక‌.. బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా అందుకుంటుంది.

ఈ యాడ్ చూసి అప్ప‌ట్లో ''మ‌రీ.. ఇంత బిల్డ‌ప్ అవ‌స‌రమా?'' అనుకున్నవాళ్లు కూడా ఉన్నారు. కానీ.. ఇప్పుడు క‌రోనా నేప‌థ్యంలో అదే ప‌ద్ధ‌తిలో చ‌దువులు కొన‌సాగుతుండ‌డం విశేషం. ఎవ‌రు ఆ యాడ్ ను బ‌య‌ట‌కు తెచ్చారోకానీ.. ఇప్పుడు తెగ స‌ర్క్యులేట్ అవుతోంది. ద‌శాబ్ద‌కాలం నాటి ఐడియా.. ఇప్పుడు భ‌లేగా నిజ‌మైందంటూ కామెంట్ చేస్తున్నారు. ''రియల్లీ.. వాట్ యాన్ ఐడియా స‌ర్ జీ'' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Full View
Tags:    

Similar News