అనూహ్యంగా ఢిల్లీ పర్యటన ఫిక్స్ కావటం.. ప్రధానితో సహా కీలక నేతలతో భేటీకి అపాయింట్ మెంట్లు ఓకే కావటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధానికి పయనం కావటం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి ఢిల్లీకి చేరుకున్న జగన్ సాయంత్రం 4.12 గంటల నుంచి 5.12 గంటలమధ్య వరకు ప్రధాని మోడీ అధికారిక నివాసంలో భేటీ కావటం గమనార్హం. ఈ సందర్భంగా ఆయనకు 8 వినతులతోకూడిన వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు.
తాము పేర్కొన్న 8 అంశాల్ని సత్వరమే పరిష్కరించాలని కోరారు. విభజన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బ పడిందన్నారు. 58 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 45 శాతం ఆదాయం మాత్రమే దక్కిందన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి ఆ లోటు తీర్చటానికి ప్రత్యేక హోదా హామీతో పాటు అనేక హామీలుఇచ్చారని.. ఇప్పటికి అందులోని చాలా అంశాల్ని నెరవేర్చలేదన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజాగా ప్రధాని మోడీకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్న అంశాలన్ని గతంలో ఇచ్చినవే కావటం.
అదే సమయంలో మూడు రాజధానుల అంశం.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశాలు ఎనిమిది వినతుల్లో లేకపోవటం గమనార్హం. ఇంతకూ ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్న 8 అంశాల్ని చూస్తే..
1. పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014 ఏప్రిల్ 1 అంచనాల మేరకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో చెప్పింది. పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అప్పటివరకు ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చు మొత్తం రాష్ట్రం మీద పడింది. ప్రాజెక్టు ఖర్చులో అధిక భాగం 2013నాటి భూసేకరణ చట్టం అమలుకే పెట్టాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రానికి తీవ్ర భారం. పోలవరం ప్రాజెక్టులో కేవలం ఇరిగేషన్ భాగానికి మాత్రమే నిధులు ఇస్తామని చెప్పటం సరికాదు. మీరు జోక్యం చేసుకోవాలి. పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి.
రూ.2,100 కోట్ల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలి.
2. విభజన నాటి రెవెన్యూ లోటును కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేస్తామని నాటి ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు. రూ.16,078.76 కోట్లు ఉన్నట్లుగా కాగ్ నిర్దారించింది. అయితే..తర్వాత అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం దాన్ని రూ.4117.89 కోట్లకు కుదించింది. పెండింగ్ లో ఉన్న రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలి.
3. విభజన వేళ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఏపీ జెన్ కో విద్యుత్తు అందించింది. అందులో భాగంగా రాష్ట్రానికి రూ.6284 కోట్ల బకాయిలు రావాలి. వాటిని చెల్లించేలా తెలంగాణ సంస్థలకు తగిన ఆదేశాలు ఇవ్వాలి.
4. రాష్ట్రంలో అర్హులైన చాలామందికి జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాలేదు. దీంతో 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఎక్కువ మందిని జాతీయ పథకం పరిధిలోకి వచ్చేలా చేయగలరు.
5. కరోనా నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా తగ్గింది. దీంతో 2020-21 కేంద్రం పన్నుల్లో రూ.7780 కోట్ల నష్టం జరగింది. రాష్ట్ర సొంత ఆదాయం రూ.7వేల కోట్లు కోల్పోయాం. కొవిడ్ నివారణకు దాదాపు రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం. కాబట్టి పన్నుల వాటాలో నష్టాన్ని పూడ్చండి.
6. 2021-22 కేంద్రం ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర గరిష్ఠ రుణ పరిమితిని రూ.42,472 కోట్లుగా నిర్ధారించింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణలోకి తీసుకొని దాన్ని రూ.17,923.24 కోట్లకు తగ్గిస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో కోత పెట్టటం తగదు. అప్పులు తెచ్చుకునేందుకు రుణ పరిమితిని పెంచాలి.
7. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి.. సైట్ క్లియరెన్స్ అప్రూవల్ ను రెన్యువల్ చేయాలి.
8. కడప జిల్లాలో స్టీల్ ఫ్లాంటు కోసం ఏర్పాటు చేసిన వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద ఉన్న గనులను వేలంలో కాకుండా నేరుగా కేటాయించండి.