కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని విన్నవించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ, లోక్‌సభాపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌధరి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
దీంతో పాటు.. రాహుల్ గాంధీ విషయంలో ఎనఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుసరిస్తున్న ధోరణికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న తమ పార్టీ ఎంపీలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కూడా ఫిర్యాదు చేసింది.
సైనిక దళాల నియామక విధానంలో మార్పులకు సిద్ధమైన నరేంద్ర మోడీ ప్రభుత్వం దానిపై ముందస్తుగా ఎలాంటి విస్తృత సంప్రదింపులూ జరపలేదని రాష్ట్రపతి దృష్టికి తెచ్చింది. పార్లమెంటు స్థాయీ సంఘంతో కానీ, రాజకీయపార్టీలతో కానీ చర్చించలేదని వివరించింది. నిపుణులు సూచించిన ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.
అగ్నిపథ్ నియామకాలకు 17.5-21 ఏళ్ల వయోపరిమితిని విధించడం అనుచితమని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్రపతికి వివరించింది. దీనివల్ల చాలామంది యువతకు అవకాశం దక్కదని అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే ఆరునెలల శిక్షణ అన్నది కూడా అత్యంత తక్కువని తెలిపింది. 42 నెలల ఉద్యోగకాలం సాయుధ దళాల నాణ్యత, సామర్థ్యం, ప్రతిభపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి దృష్టికి తెచ్చింది.
ఉద్యోగ కాలం ముగించుకొని బయటికొచ్చే అగ్నివీరులకు ఉద్యోగావకాశాల విషయంలో సరైన పరిష్కారం చూపడం లేదని రాష్ట్రపతికి వివరించింది. సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపడం దారుణమైన అంశమని వెల్లడించింది.
ఈ పథకాన్ని చాలా తొందరపాటుతో, ఆదరబాదరాగా రూపొందించినట్లు స్పష్టమవుతోంది అని రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. తక్షణం అగ్నిపథ్ ను ఉపసంహరించుకోవాలని ఆయనను కోరారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, జైరాం రమేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.