హాట్ టాపిక్: 'జ‌ంధ్యం'తో జ‌న‌సేనాని

Update: 2018-02-08 13:53 GMT
సినీ హీరోల వేష ధార‌ణ‌ - న‌డ‌వ‌డిక ను బ‌ట్టి అత‌డిని అభిమానించే వారి సంఖ్య ఉంటుంది. అందులోనూ ఆ సినీ హీరో రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగి ఓ పార్టీని స్థాపించిన త‌ర్వాత‌...అతడు ఆచ‌రించే ప్ర‌తి విష‌యంపై తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం జ‌న‌సేన వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్....స‌రిగ్గా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోల‌లో ఒక‌రైన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ల‌క్ష‌లాది మంది అభిమానులున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ జ‌న‌సేనానిగా మారిన త‌ర్వాత ఆయ‌న వేష‌ధార‌ణ‌ - న‌డ‌వ‌డిక‌ను ఆయ‌న అభిమానులు - కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ప్ర‌తిప‌క్షాలు కూడా నిశితంగా ప‌రిశీలిస్తున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌రిగిన అన్యాయంపై పోరాడేందుకు ప్ర‌త్యేక జేఏసీ ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేడు లోక్ స‌త్తా అధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ - ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ భేటీ సంద‌ర్భంగా ప‌వ‌న్ జంధ్యం ధరించి క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సాధార‌ణంగా బ్రాహ్మ‌ణులు - ఆర్య‌వైశ్యులు ధ‌రించే జంధ్యాన్ని ప‌వ‌న్ ఎందుకు ధ‌రించార‌న్న సందేహం చాలామందికి క‌లిగింది. అయితే, జంధ్యంతో ప‌వ‌న్ ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఇది తొలిసారేమీ కాదు. 2014లో ఒక‌సారి - 2015లో మ‌రోసారి ఓ అభిమానిని క‌లిసిన సంద‌ర్భంగా ప‌వ‌న్....జంధ్యంతో క‌నిపించారు. అయితే, ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ ఏదో వృతం చేస్తున్నార‌ని, అందులో భాగంగానే జంధ్యం ధ‌రించార‌ని టాక్ వ‌చ్చింది. అయితే, ఆ త‌ర్వాత కూడా ప‌వ‌న్ జంధ్యాన్ని కొన‌సాగించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ చూస్తుంటే ప‌వ‌న్....సంధ్యావంద‌నం - వేద‌ప‌ఠ‌నం వంటివి రోజూ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. లేదంటే ప‌వ‌న్ సామాజిక‌వర్గం ప్ర‌కారం ప్ర‌తి రోజు జంధ్యం ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అంతేకాకుండా, జ‌న‌సేన స్థాపించిన త‌ర్వాత ప‌వ‌న్ పొలిటిక‌ల్ మీటింగ్ లు - జ‌న‌స‌భ‌లు - ప్రెస్ మీట్ ల‌కు ఎక్కువ‌గా కుర్తా(లాల్చీ)ల‌ను ధ‌రించి సింపుల్ గా క‌నిపిస్తున్నారు. పార్టీ స్థాపించిన త‌ర్వాత ప‌వ‌న్ చ‌దివే ర‌క‌ర‌కాల పుస్త‌కాలు - `ఇజ‌మ్`ల గురించిన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఓ ప‌క్క హేతువాదిలాగా - త‌త్వ‌వేత్త‌లాగా - ఆలోచింప‌జేసేలా విష‌య ప‌రిజ్ఞానంతో ప‌వ‌న్ మాట్లాడే తీరు ప‌లువురిని ఆక‌ట్టుకుంటుంది. అదే స‌మ‌యంలో మ‌రోప‌క్క దైవ చింత‌న‌తో ఆధ్యాత్మిక ధోర‌ణిలో హైంద‌వ ధ‌ర్మాన్ని ప‌క్కాగా  ఆచ‌రించే వ్య‌క్తిలా ప‌వ‌న్ క‌నిపిస్తుంటారు. ఈ రెండు ధోర‌ణులలో దేనిని ఆచ‌రించాలి? లేక రెండింటినీ బ్యాలెన్స్ చేయాలా? అన్న మీమాంశ‌లో ప‌వ‌న్ స‌త‌మ‌త‌మ‌వుతున్నాడేమో? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.
Tags:    

Similar News