ఏపీ రాజధాని అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర గురించి అందరికీ తెలిసిందే. వివిధ కారణాలతో రైతులు తమ పాదయాత్రను ప్రస్తుతం విరమించుకున్నారు. అయితే.. వీరు తమ పాదయాత్రలో వినియోగిస్తున్న రథం ఇప్పుడు మరోసారి వివాదానికి దారితీసింది. తాజాగా.. పోలీసులు తమపై చేయి చేసుకున్నారని అమరావతి పాదయాత్ర బౌన్సర్లు తెలిపారు. రథం వద్దకు వచ్చిన పోలీసులు వివరాలు ఆరా తీస్తూ.. చేయి చేసుకున్నారన్నారు. దీంతో టీడీపీ నేతలు ఘటనాస్థలానికి చేరుకుని రథాన్ని పరిశీలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అమరావతి మహాపాదయాత్ర 2.0 జరుగుతున్న క్రమంలో పోలీసులకు.. రైతులకు మధ్య వివాదం ఏర్పడింది. రైతులను పోలీసులు అడుగడుగునా.. అడ్డుకున్నారనేది వారి అభియోగం. ఈ నేపథ్యంలో రైతులు తమ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించి.. పోలీసుల వ్యవహార శైలిపై.. హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తమ వెంట ఉన్న శ్రీవారి రథంతోపాటు.. ఒకటి రెండు రథాలను అక్కడే ఉంచేశారు. ఈ రథానికి కాపలాగా బౌన్సర్లను ఏర్పాటు చేశారు. అయితే.. తాజాగా డీఎస్పీ బాలచంద్రారెడ్డి సిబ్బందితో పాటు మఫ్టీలో రథం వద్దకు వచ్చారని బౌన్సర్లు తెలిపారు. పాదయాత్రలో పాల్గొనే వాహనాలపై ఆరా తీశారని అన్నారు.
అయితే.. ఈ క్రమంలో తమపై పోలీసులు చేయి చేసుకున్నారని బౌన్సర్ ఆరోపిస్తున్నారు. రథంలో ఉన్న సీసీ ఫుటేజీ, హార్డ్ డిస్కులు తీసుకెళ్లారని చెప్పాడు. ఈ విషయాన్ని రైతు జేఏసీ నేతలకు సమాచారం ఇచ్చామన్నారు. ఇక, ఈ విషయం తెలిసిన వెంటనే..టీడీపీ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప.. రంగంలోకి దిగారు. రథానికి కాపలా ఉన్న బౌన్సర్లపై దాడి చేయడం దారుణమని రాజప్ప అన్నారు. రామచంద్రాపురంలో పాదయాత్ర రథాన్ని చినరాజప్ప, రెడ్డి సుబ్రహ్మణ్యం పరిశీలించారు.
రథం వద్దకు డీఎస్పీ మఫ్టీలో వచ్చి ముగ్గురు బౌన్సర్లను కొట్టారని చినరాజప్ప తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు తీసుకెళ్లారని.. పాదయాత్ర అంశం కోర్టులో ఉండగా ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు ఇబ్బందులు కలిగించారని రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. కాపలా ఉన్న బౌన్సర్లను అనవసరంగా కొట్టారని.. యువకులపై కేసులు పెడితే డీఎస్పీపైనా కేసు నమోదు చేయాలని రెడ్డి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. అయితే.. ఈ విషయంపై పోలీసుల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అసలు బౌన్సర్లు ఆరోపిస్తున్న రథం దగ్గరకు వచ్చింది.. పోలీసులేనా.. లేక మరెవరైనానా? అనేది కూడా ఆసక్తిగా మారింది. చూడాలి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.