మహమ్మారి సహా అన్ని వైరస్ లు అంతమైతే ఏం జరుగుతుంది?

Update: 2020-06-23 11:30 GMT
వైరస్ లు.. ప్రపంచ మానవాళికి శత్రువులుగా మారాయి. 1918లో మశూచి వైరస్ కారణంగా 20 కోట్ల మంది చనిపోయారు. తాజాగా ఇప్పుడు మహమ్మారి వైరస్ కారణంగా లక్షలమంది మరణిస్తున్నారు. తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంది.ప్రాణాంతక వైరస్ లు నాటి నుంచి నేటి వరకు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

మానవాళిని కబళిస్తున్న వైరస్ లన్నీ అంతం కావాలని ఇప్పుడు అందరూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ముఖ్యంగా మహమ్మారిను మన నుంచి దూరం చేయాలని వేడుకుంటున్నారు.

కానీ మహమ్మారితో సహా వైరస్ లన్నీ అంతమైతే మనలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరని విస్కాన్సిన్ -మాడిసన్ యూనివర్సిటీ సైంటిస్ట్  టోని గోల్డ్ బెర్గ్ చెబుతున్నారు. ఎందుకంటే మెజార్టీ వైరస్ లు మానవులకు వ్యాధి కారకాలు కావని.. అంతేకాదు చాలా వరకు పర్యావరణాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. వైరస్ లు మన జీవితంలోనే ఒక భాగమే అని వైరాలజిస్టులు చెబుతున్నారు.

మానవులకు హాని చేసేవి కొన్ని వైరస్ లు మాత్రమే.. కానీ ఈ భూమ్మీద వైరస్ లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వ్యాధికార వైరస్ లపై మాత్రమే పరిశోధనలు సాగుతున్నాయి. కానీ ఈ భూమిని కాపాడే వైరస్ లపై పరిశోధనలు ఇప్పుడే మొదలయ్యాయి.

వైరస్ లు లేకపోతే ఈ భూమ్మీద మానవులతో సహా జీవం ఉనికే ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూమ్మీద ఉన్న ప్రతీ వైరస్ ను నాశనం చేయడం సాధ్యం కాని పని.. వైరస్ లు లేకుండా ఈ ప్రపంచం ఊహించడం కష్టం. మానవ మనుగడలో వాటి పాత్ర ఎంతో ఉంది.వాటి గురించి మనం మరింతగా నేర్చుకోవాలి. ఈ భూమ్మీద కోట్లాది వైరస్ లు ఉన్నాయి. కానీ కనుగొన్న వైరస్ లు చాలా తక్కువ. వ్యాధికార క వైరస్ లే కాదు.. మంచి చేసే వైరస్ లు ఉన్నాయి. వాటిపై దృష్టిపెడితే ఈ రోగాలను జయించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వైరస్ లు అందించే శక్తి ద్వారానే అతి సూక్ష్మ జీవులే ఈ భూగ్రహంపై సగం కన్నా ఎక్కువ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. అవే వైరస్ లు లేకపోతే మనకు ఆక్సిజన్ అందక చనిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News