మనలో చాలా మంది బిజీగా ఉండో వేరో ఇతర కారణాల వల్లనో నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఇలా సరిగా నిద్ర పోకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం పనులను ఎలా శ్రద్ధ పెట్టి చేస్తామో.. అలాగే శ్రద్ధతో నిద్రపోవాలని వైద్యులు సూచిస్తారు. ఎవరైతే నిద్రను నిర్లక్ష్యం చేస్తారో వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక ప్రస్తుత స్మార్ట్ యుగంలో సెల్ ఫోన్ వాడడం అనివార్యమైపోయింది. చివరికి పిల్లలు చదవాలన్నా కూడా ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లు తప్పరిసరి అయ్యాయి. ఇలా పొద్దంతా సెల్ ఫోన్లలో గడుపుతూ నిద్ర సరిగా పోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయట. నిద్రను కూడా నిత్య కృత్యంలా నెరవేర్చాలని చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారంగా అందరూ రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రించాలి. కానీ చాలా మంది ఈ గజిబిజి జీవితంలో సరిగ్గా నిద్రపోవడం లేదు. ఎనిమిది గంటలని వైద్య సంస్థ సూచిస్తే కనీసం అందులో సగం సమయం కూడా చాలా మంది పడుకోవడం లేదు. కానీ ఇలా తక్కువ సమయం పడుకోవడం వల్ల మనిషిలో చాలా రకాల సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే టైం టేబుల్ రూపొందించుకుని మరీ దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ నిద్రించాలని వైద్యులు చెబుతున్నారు. అసలు ప్రస్తుత రోజుల్లో యువత నిద్ర పోవడమనేదే మర్చిపోయారు. ఫోన్లలో గేమ్స్ ఆడుతూ, సినిమాలు చూస్తూ ఎప్పుడో రోజులో కొద్ది సేపు మాత్రమే నిద్రపోతున్నారు.
ఇలా పోవడం ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇలా వయసులో ఉండగా సరిగ్గా నిద్ర పోకపోతే వారిలో భవిష్యత్ లో షుగర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇదేదో మామూలుగా చెప్పిన విషయం కాదు దీనిపై కొంత మంది పరిశోధనలు కూడా చేసి ఇదే విషయాన్ని వెల్లడించారు. కేవలం షుగర్ భారిన పడడమే కాకుండా మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని కోల్పోవడంతో అనేక రోగాల భారిన పడతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరిపడేంత నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు కూడా ఉద్భవిస్తాయని బ్రిటన్ లో చేసిన ఓ అధ్యయనంలో వెలువడింది. నిద్ర లేమి కారణంగా మనలో కడుపునిండిందని భావన కలిగించే లెప్టిన్ హార్మోన్ విడుదలవడం బాగా తగ్గిపోతుంది.
అదే సమయంలో ఎక్కువగా ఆకలిని కలిగించే గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని కారణంతో మనం అధికంగా తింటూ ఊబకాయం వంటి సమస్యలకు గురవుతాం. నైట్ షిఫ్ట్ చేసే వారిలో ఈ సమస్య అధికంగా ఉత్పన్నమవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. ఎలాగూ నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిదనే సాకుతో అనేక మంది అతిగా నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వయసు మీద పడిన వాళ్లు రోజులో కనీసం ఎనిమిది గంటల సేపైనా పడుకోవాలి. లేదంటే కనీసం ఏడు గంటలైనా నిద్రంచాలి.
అంతకన్నా తక్కువ సేపు పడుకుంటే వారిలో అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అలా కాకుండా కొంత మంది పెద్దవాళ్లు రోజులో దాదాపు పది గంటల సేపు నిద్రిస్తారు. ఇలా చేయడం కూడా మంచిది కాదని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం వయసులో ఉన్న వారు మాత్రమే దాదాపు పది గంటల పాటు నిద్రించాలట. అలా కాకుండా ఇంకా ఎక్కువ సమయం నిద్రపోతే వారికి కూడా మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు మాత్రం 18 గంటల సేపు నిద్రపోవడం ఉత్తమం.